Fast track court verdict in Banjara Hills DAV Public School Girl Sexual Harassments Case : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆరు నెలల పాటు ఈ కేసు దర్యాప్తు కొనసాగింది. విచారణ తర్వాత శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది.
Fast track court verdict in Banjara Hills DAV Public School Girl Sexual Harassments Case: గతేడాది అక్టోబర్ 17న బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ను అక్టోబర్ 19న పోలీసులు అరెస్టు చేశారు. కారు డ్రైవర్ను తరగతి గదిలోకి అనుమతించడంపై ప్రిన్సిపల్ మాధవిపైనా కేసు నమోదు చేశారు. అయితే కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది.