Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో... యమునా నది మహోగ్ర రూపం దాల్చింది. నదిలో నీటిమట్టం ఇవాళ ఉదయం నాటికి 208.48 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు.
Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో... యమునా నది మహోగ్ర రూపం దాల్చింది. నదిలో నీటిమట్టం ఇవాళ ఉదయం నాటికి 208.48 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. సాయంత్రం వరకు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు యమునా నది ఉగ్రరూపంతో... పరివాహక ప్రాంతంలోని చాలా ఇండ్లలోకి నీరు చేరింది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏరియాలోకి వరద నీరు వచ్చింది. నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఢిల్లీలో వచ్చే ఐదారు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.