Padmasri Dr Gopala Krishna Gokale: పద్మశ్రీ డా గోపాలకృష్ణ గోఖలే.. దేశం మెచ్చిన వైద్యుడికి జీ తెలుగు న్యూస్ అవార్డ్

Padmasri Dr Gopala Krishna Gokale conferred with zee telugu news health conclave award: డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే.. ప్రముఖ కార్డియో థొరాసిక్ వైద్య నిపుణులు. తెలుగు రాష్ట్రాలలో తొలి గుండె మార్పిడి ఆపరేషన్‌ చేసిన వైద్యులు. నిమ్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా వృత్తిని ప్రారంభించిన ఆయన.. దేశ, విదేశాల్లో వైద్యరంగంలో సాధిస్తున్న పురోగతిని అందిపుచ్చుకుంటూ నిరుపేదల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

  • Zee Media Bureau
  • Sep 20, 2022, 03:14 AM IST

Padmasri Dr Gopala Krishna Gokale conferred with zee telugu news health conclave award: ఆధునిక వైద్యం మీద వివిధ సదస్సులలో అనేక పత్రాలు సమర్పించారు. ఉచిత ఆరోగ్య శిబిరాలు, ఉచిత పబ్లిక్ సెమినార్లు, అవేర్‌నెస్ డ్రైవ్‌లు నిర్వహించారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో సహృదయ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషనల్ ట్రస్టుని స్థాపించారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారు కూడా వైద్యులే. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉగాదిపురస్కారంతో పాటు.. రోటరీ క్లబ్‌లు, లయన్స్ క్లబ్‌లు, జేసీస్ క్లబ్‌లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సహా అనేక వృత్తి, సామాజిక సంస్థలచే అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అంతేకాదు.. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసి గౌరవించింది.

Video ThumbnailPlay icon

Trending News