Dr. Sree Bhushan Raju gets Zee Telugu News Health Conclave Award : డాక్టర్ శ్రీభూషణ్ రాజు. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. పేదల మనసెరిగి, వాళ్లకు మానసికంగానూ ఉపశమనం కలిగేలా వైద్య చికిత్స అందించే అరుదైన డాక్టర్. రెండు దశాబ్దాలుగా నిమ్స్‌లో ఫ్యాకల్టీగా, నెఫ్రాలజీ స్పెషలిస్టుగా అనుభవం ఆయన సొంతం. ఎక్కడెక్కడి నుంచో తన దగ్గరకు వచ్చిన రోగులు.. ఎప్పుడు కాల్ చేసినా పలుకుతారు. ఫోన్‌లోనే ఓపిగ్గా సందేహాలు తీరుస్తారు.
Dr. Sree Bhushan Raju gets Zee Telugu News Health Conclave Award : హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో డా శ్రీ భూషణ్ రాజు ఏడు ఫెలోషిప్‌లు పొందారు. లాన్సెట్ వంటి ప్రఖ్యాత హెల్త్ జర్నల్స్‌లో డాక్టర్ శ్రీభూషణ్ రాజ్‌కు చెందిన వందకు పైగా ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి. 500కు పైగా సెమినార్స్‌లో లెక్చర్స్ ఇచ్చారు. 200కు పైగా సైంటిఫిక్ పేపర్లు సమీక్షించారు. రెండు భారీ నేషనల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్‌కు ఆయన అసోసియేట్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీభూషణ్ కీర్తి కిరీటంలో ఇవి కొన్ని మాత్రమే. ఆయన గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇదిగో ఈ ఏవీ వీక్షించాల్సిందే.