Godavari Floods:గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. కాళేశ్వరం నుంచి 28 లక్షలకు పైగా వరద వస్తుండటంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. అంతకు ముంది ప్రమాదకర స్థాయిలో గోదారమ్మ ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 68.3 అడుగులకు చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు 69 అడుగులకు చేరింది. సాయంత్రానికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.