Satirical folk song on allu arjun: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. పుష్ప2 రికార్డుల పరంగా ఎంత వార్తలలో నిలిచిందో.. తొక్కిసలాట ఘటనతో అల్లుఅర్జున్ కూడా.. అంత చెడ్డపేరు మూటకట్టుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అల్లుఅర్జున్ పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు.
అయితే.. సీఎం రేవంత్ సర్కారు మాత్రం.. తొక్కిసలాట ఘటనను ఎంతో సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తొంది. రేవతి అనే మహిళ తొక్కిసలాట ఘటనలో తన ప్రాణాలు కోల్పోయింది. అదే విధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ అంతా సీఎం రేవంత్ సర్కారును కలవడం కూడా తెగ చర్చనీయాంశంగా మారింది.
Using a sensitive issue to create a satirical song is absolutely nonsensical and unacceptable. Some boundaries should never be crossed.pic.twitter.com/iEpuEsJiHk
— Milagro Movies (@MilagroMovies) December 29, 2024
బీజేపీ, బీఆర్ఎస్ లు బన్నీని సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తొంది. అయితే.. బన్నీ ఘటన మాత్రం ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే ఒక ఫోక్ సాంగ్ మాత్రం ప్రస్తుతం మరోసారి రచ్చకు దారితీసిందని చెప్పుకొవచ్చు. తాజాగా ఈ ఘటనపై సెటైరికల్‌గా ఒక ప్రైవట్ పాట సోషల్ మీడియాలో రచ్చగా మారింది..
దీనిలో.. ‘టిక్కెట్లు మేమే కొనాలి.. సప్పట్లు మీకే కొట్టాలి’. ‘సావులు మేమే చూడాలి.. సల్లంగా మీరే ఉండాలి’ అంటూ పాట వైరల్ గా మారింది. ఇది అల్లు అర్జున్ ను ఇండైరెక్ట్ గా తిప్పిపొడుస్తున్నట్లు ఉందని బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారంట.
ఇది కావాలని కాంగ్రెస్ సర్కారు.. వెనకుండీ..ఈ టైమ్ లో పాటను రిలీజ్ చేయించారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పాట మాత్రం నెట్టింట దుమ్మురేపుతుందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter