Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించి నిలువరించడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు దిగుతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఎవరి ఒత్తిడితో పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.