Man Carries His Wife on Shoulders: భార్యను భుజాలపై ఎక్కించుకుని బాహుబలి రేంజులో తిరుమల కొండ మెట్లెక్కుతూ అందరినీ ఔరా అని ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టేలా చేశాడు సత్తి బాబు. అలాగని అలా భార్యను ఎత్తుకుని కొండపైకి నడిచి వస్తానని ఆయనేమీ ఆ వెంకన్నకు మొక్కుకోలేదు. మరి సత్తిబాబుకు ఆ అవసరం ఏమొచ్చింది ? ఇంతకీ ఈ సత్తి బాబు ఎవరనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం... సత్తి బాబు పూర్తి పేరు వరదా వీర వెంకట సత్యనారాయణ. బంధువుల, స్నేహితులు అంతా అతన్ని ముద్దుగా సత్తి బాబు అని పిలుచుకుంటారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సత్తిబాబు స్వస్థలం. లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని.
ఇక అసలు విషయంలోకి వస్తే.. సత్తి బాబు తాజాగా తిరుమల దైవ దర్శనానికి వెళ్లారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి తిరుమల వెళ్లే భక్తుల్లో చాలామంది మెట్ల మార్గంలో కొండపైకి వస్తామని మొక్కుకుంటుంటారు. అక్కడి భక్తుల్లో ఇది ఎక్కువగా కనిపించే ఆచారం. అలాగే సత్తి బాబు దంపతులు కూడా మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి ప్రయాణమయ్యారు. మధ్యలో కొంతదూరం వెళ్లిన తర్వాత భర్త సత్తిబాబు వేగంగా మెట్లు ఎక్కుతుండగా తాను వెనుకబడి పోతుండటం చూసిన సత్తి బాబు భార్య లావణ్యకు ఏం చేయాలో అర్థంకాక ఆయనకు ఓ సవాల్ విసిరింది. నువ్వొక్కడివే మెట్లు ఎక్కడంలో ఏం గొప్ప ఉంది.. నన్ను ఎత్తుకుని కూడా వేగంగా వెళ్తే అప్పుడు నువ్వు గొప్ప అని ఒప్పుకుంటా అని సవాల్ విసిరిందామె. ఆ తర్వాతేం జరిగిందో మీరే చూడండి.
Also Read : Man Carries His Wife on Shoulders: భార్యను భుజాలపై ఎత్తుకుని తిరుమల కొండపైకి.. సత్తిబాబు మామూలోడు కాదు..