Varavara Rao: భీమాకోరెగావ్ కేసులో వరవరరావుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. వరవరరావు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. వరవరరావు ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని అడిషనల్ సొలిసిటర్ జనరల్ గట్టిగా వాదించారు. ఇలాంటి కేసుల్లో అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వొద్దని NIA కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. అనారోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు లేదా అని జస్టిస్ లలిత్ ప్రశ్నించారు. NIA వాదనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. వరవరరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Varavara Rao: భీమాకోరెగావ్ కేసులో వరవరరావుకు బెయిల్..