రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది మృతి, 58 మందికి గాయాలు

రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది మృతి, 58 మందికి గాయాలు

Updated: Nov 12, 2019, 03:35 PM IST
రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది మృతి, 58 మందికి గాయాలు

ఢాకా: ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటన బంగ్లాదేశ్‌లోని బ్రహ్మంబారియా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందగా మరో 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు చాలామంది గాఢ నిద్రలో ఉండటంతో నిద్రలోనే వారి ప్రాణాలు పోయాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వైపు వెళ్తున్న తుర్న నిషిత రైలు చిట్టగాంగ్ వైపు వెళ్తున్న ఉదయన్ రైలును ఢీకొందని ఢాకా పోలీసులు తెలిపారు. ఢాకాకు 100 కిమీ దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

రైలు ప్రమాదంలో నాలుగు బోగీలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో సహాయ కార్యక్రమాలు చేపట్టిన అనంతరం 16 మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను బ్రహ్మనంబారియాలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అక్కడి అధికారవర్గాలు తెలిపాయి.