Mexico pilgrimage Bus Crash: సెంట్రల్ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది మరణించగా...మరో 32 మంది గాయపడ్డారు. మెక్సికో సిటీలోని జోక్విసింగో(Joquicingo) టౌన్‌షిప్‌లో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అధిక వేగంతో వెళ్తుండగా బ్రేకులు విఫలమయ్యాయని.. దీంతో ప్రమాదానికి గురైందని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: Coal Mine Tragedy: బొగ్గు గనిలో భారీ ప్రమాదం-52 మంది కార్మికులు మృతి
డిసెంబర్ 12న జరుపుకునే 'వర్జిన్ ఆఫ్ గ్వడెలోప్' సమీపిస్తున్న నేపథ్యంలో..మెక్సికన్లు పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే మిచోకాన్(Michoacan) అనే ప్రాంతం నుంచి రోమన్ క్యాథలిక్ యాత్రికులు (Roman Catholic pilgrims ) సందర్శించే చల్మా పట్టణానికి ఈ బస్సు బయలుదేరింది. అయితే.. ఇరుకైన రోడ్లు, కాలం చెల్లిన బస్సుల్లో ప్రయాణించడం వల్లే అత్యంత తరచుగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook