Gold Mine collapse: సూడాన్‌లో ఘోర ప్రమాదం...కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి!

Gold Mine collapse: సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని కుప్పకూలిన ఘటనలో 38 మంది మృతి చెందారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 08:45 AM IST
  • సూడాన్‌లో ఘోర ప్రమాదం
  • కుప్పకూలిన బంగారు గని
  • 38 మంది దుర్మరణం
Gold Mine collapse: సూడాన్‌లో ఘోర ప్రమాదం...కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి!

Sudan Gold Mine collapse: సుడాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గని కూలిపోవడంతో కనీసం 38 మంది మరణించారు. ఈ ఘటన పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్‌లో (West Kordofan province) మంగళవారం జరిగింది. రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా 700 కిలోమీటర్లు (435 మైళ్లు) దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో (Fuja village) మూసి ఉన్న గనిలో ప్రమాదం జరిగిందని సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  

ఈ ప్రమాదంలో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలోని కొన్ని చిత్రాలను మైనింగ్ కంపెనీ ఫేస్ బుక్ లో (Facebook) పోస్ట్ చేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను వెలికి తీసేందుకు రెండు ప్రొక్లెయిన్ల ఉపయోగిస్తున్నారు.  

Also Read: Bangladesh Ferry Fire: నౌకలో భారీ అగ్నిప్రమాదం... 37 మంది సజీవ దహనం!

సుడాన్ (Sudan) దేశవ్యాప్తంగా అనేక బంగారు గనులు ఉన్నాయి. 2020లో తూర్పు ఆఫ్రికా దేశం 36.6 టన్నులను ఉత్పత్తి చేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్ ఆరోపణల నేపథ్యంలో.. గత రెండేళ్లలో సుడాన్ ప్రభుత్వం గోల్డ్ అక్రమ తవ్వాలను నియంత్రిస్తోంది. ఈ క్రమంలోనే ఫుజా గ్రామంలోని ఈ బంగారం గనిని మూసివేశారు. అయితే, స్థానికులు అక్రమంగా గనిలో తవ్వకాలు చేపడుతుండగా ప్రమాదం జరిగింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News