Afghanistan: 'గాల్లో' కలసిన అఫ్ఘన్ వాసుల ప్రాణాలు.. విమాన చక్రంలో మానవ శరీర భాగాలు

ఇంత కన్నా దారుణ ఘటన ఇంకోటి ఉండదేమో.. ప్రాణ భయంతో విమానం వీల్ భాగంలో ఎంత మంది  ఆఫ్గన్ ప్రజలు కుర్చున్నారో తెలిదు కానీ, ల్యాండ్ అయిన విమాన చక్రాల్లో, టైర్ భాగాల్లో మానవ శరీర భాగాలు చూసిన అధికారులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు.

Last Updated : Aug 18, 2021, 06:46 PM IST
  • అందరిని కలచివేస్తున్న హృదయ విదారక ఘటన
  • అమెరికన్ కార్గో విమాన చక్రాల్లో మానవ శరీర భాగాలు
  • తీవ్ర దిగ్భాంతికి గురైన అమెరిక అధికారులు
Afghanistan: 'గాల్లో' కలసిన అఫ్ఘన్ వాసుల ప్రాణాలు.. విమాన చక్రంలో మానవ శరీర భాగాలు

 తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌ను (Afghanistan) ఆక్రమించిన తరువాత రోజు రోజుకు పరిస్థితిలు ఉహించని విధంగా మలుపు తిరుగుతున్నాయి. ఏదేమైన మారుతున్న అక్కడి  పరిస్థితులకు సామాన్య ప్రజలు ప్రాణాలని కోల్పోవలసి వస్తుంది. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఫోటోలు, వీడియోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే... తాజాగా అమెరికా (America) విడుదల చేసిన ఘటన విషయాలు అందరి హృదయాలని కలచి వేస్తుంది. 

తాలిబన్ల (Taliban) ఆక్రమణతో మళ్లీ అఫ్ఘనిస్తాన్‌ చీకటి పాలనలోకి వెల్లనుందన్న భావనలో అక్కడి ప్రజలు దేశం విడిచేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆదివారం కాబుల్ విమానాశ్రయం (Kabul Airport) నుండి బయలుదేరి ఖ‌తార్‌ (Qatar) చేరిన కార్గో విమానం (American )పరీశిలించిన తరువాత అగ్రరాజ్యం ఒక హృదయ విదారక ఘటనను ప్రపంచంతో పంచుకుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 👨🏼‍✈️7️⃣3️⃣7️⃣ 🆖 CPT (@piloteyes737)

Also Read: ప్రపంచ నేతలారా! 'మా దేశాన్ని ఈ గందరగోళం నుంచి కాపాడండి': రషీద్ ఖాన్

అదేంటంటే... అఫ్ఘనిస్తాన్‌ నుండి ఆదివారం గాల్లోకి ఎగిరిన అమెరికన్ కార్గో విమానంపై (American cargo plane) ఎక్కేందుకు జనం ఎలా ఎగబడ్డారో మనం వీడియోలో చూసిందే.  విమానం ట‌ర్మాక్‌పై కూర్చొన్న కొంత మంది గాల్లోకి ఎగిరిన తరువాత కింద పడిన ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. కొంత మంది విమానలో ఖాళీ లేక వీల్ భాగాల్లో కుర్చోన్నారు. 

అక్కడి నుండి బయల్దేరిన అమెరికన్ కార్గో విమానం ఖ‌తార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో లాండ్ అయింది. తరువాత "విమాన చక్ర భాగాల్లో మానవ శరీర భాగాలు, అవయవాలు" చూసిన వైమానిక దళ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఘటన చూసిన అమెరికా వైమానిక ద‌ళం (U.S. Air Force) తీవ్ర దిగ్భాంతికి గురైనట్లు వెల్లడించింది.

Also Read: ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వెంటనే తిరిగి రాకపోతే ప్రమాదమే

సరకులతో వెళ్లిన తమ విమానం కాబూల్‌లో (Kabul) ల్యాండ్  అయిన కాసేపటికే, వందలాది మంది విమానం ఎలా ఎక్కారో తెలియదని, అక్కడి పరిస్థితి పూర్తిగా మారుతుందని గమనించిన వెంటనే విమానాన్ని తిరిగి గాల్లో ఎగిరేలా చేసామని అధికారులు చెప్తున్నారు. గందరగోలంతో నిండిన కాబుల్ విమానాశ్రయంలో కొంత మంది మృత్యువాత పడగా, ఖచ్చితంగా ఎంత మంది మరణించారో ఇప్పటి వరకి స్పష్టత లేదని అధికారులు వాపోతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News