Indian Student Dies in Ukraine: ఉక్రెయిన్‌లో తాజాగా భారత్‌కు చెందిన మరో విద్యార్థి నేడు (మార్చి 2) ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌కు చెందిన చందన్ జిందాల్ అనే 22 ఏళ్ల మెడికల్ విద్యార్థి.. బుధవారం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చందన్ లాల్ మృతి చెందాడు అనేది ఆ మీడియా కథనాల సారాశం. అయితే ప్రస్తుతం రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో ఉన్న ప్రజలంతా బిక్కు బిక్కుంటూ.. ఎప్పుడు ఏం జరుగుతుందే తెలీక ఆందోళన చెందుతున్నారు.
ఉక్రెయిన్‌పై నిన్న రష్యా చేసిన మిస్సైల్ దాడిలో కర్ణటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మృతి చెందటంతో.. దేశవ్యాప్తంగా ఆందోళనలు కలిగించింది. ఈ ఘటన మరవక ముందే.. మరో విద్యార్థి ఇలా అకాల మరణం చెందటం విచారకరం.
ఇప్పటికే ఖర్కేవ్ నగరాన్ని వీడిన విద్యార్థులు..
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల విషయంలో రష్యా స్పీడు పెంచిన నేపథ్యంలో ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల నుంచి భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలను వీడినట్లు కూడా తెలిసింది.
Also read: Joe Biden confuse: జో బైడెన్ స్పీచ్‌లో తడబాటు.. జోకులు వేస్తున్న నెటిజన్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook