యాపిల్ క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయ్..!

త్వరలో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ కార్డులు వస్తున్నాయా..?

Last Updated : May 12, 2018, 01:53 PM IST
యాపిల్ క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయ్..!

త్వరలో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ కార్డులు వస్తున్నాయా..? అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నారు యాపిల్ సంస్థ వర్గాలు. ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ‘గోల్డ్ మ్యాన్ శాక్స్’ భాగస్వామ్యంతో యాపిల్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఓ క్రెడిట్ కార్డు తీసుకురానుందట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక 'వాల్‌స్ట్రీట్‌' జర్నల్‌ రిపోర్టు చేసింది.

ఇటీవలే గోల్డ్ మ్యాన్ శాక్స్‌తో టెక్ దిగ్గజం యాపిల్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మరింత ఆదాయం పొందే వ్యూహంలో భాగంగా క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతోందని తెలిసింది. దీనివల్ల యాపిల్ ఆదాయాలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మాట్లాడటానికి ఇరు సంస్థలు నిరాకరించారు.

యాపిల్ పే అనేది ఒక మొబైల్‌ పేమెంట్‌, డిజిటల్‌ వాలెట్‌ ప్లాట్‌ఫామ్‌. తన రెవెన్యూల్లో గాడ్జెట్లనే కాకుండా.. మిగతా వాటిని భాగస్వామ్యం చేయాలని యాపిల్ యోచిస్తోంది. బ్యాంకులు, టెక్‌ స్టార్టప్‌ల నుంచి ఇటీవల పేమెంట్స్‌ స్పేస్‌లో తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే..!

More Stories

Trending News