విడిగా పడుకోండి.. అవసరమైతే భార్యలను దండించండి.. భర్తలకు మహిళా మంత్రి సలహాలు..

Malaysian Woman Minister Advices to Husbands: ఆమె ఓ మహిళా మంత్రి... ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో భర్తలకు ఉచిత సలహా ఇచ్చారు. మాట వినని భార్యలను దండించాలని చెప్పారు. సదరు మంత్రి వ్యాఖ్యలపై అక్కడి ప్రజలు భగ్గుమంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 04:42 PM IST
  • మలేషియా మహిళా మంత్రి సితీ జైలా వివాదాస్పద వ్యాఖ్యలు
  • భార్యలను దారికి తెచ్చుకునేందుకు దండించాలన్న మంత్రి
  • మదర్ టిప్స్ పేరిట ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసిన మంత్రి
  • మంత్రి సలహాలపై మండిపడుతున్న మలేషియన్లు
విడిగా పడుకోండి.. అవసరమైతే భార్యలను దండించండి.. భర్తలకు మహిళా మంత్రి సలహాలు..

Malaysian Woman Minister Advices to Husbands: మలేషియాకు చెందిన ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భార్యలను దారికి తెచ్చుకునేందుకు... అవసరమైతే వారిని సున్నితంగా దండించాలని సదరు మంత్రి భర్తలకు సలహా ఇచ్చారు. ఒకరకంగా ఇది గృహ హింసను నార్మలైజ్ చేసే ప్రయత్నమేనని ఆ మహిళా మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక బాధ్యాతయుతమైన మంత్రి ఇలాగేనా మాట్లాడేదని మలేషియా ప్రజలు ఆమెపై మండిపడుతున్నారు.

మలేషియా మహిళా మంత్రి సితీ జైలా మహమ్మద్ యూసుఫ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'మదర్ టిప్స్' పేరిట ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రెండు నిమిషాల నిడివి గల వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఇందులో భార్యాభర్తల గురించి మాట్లాడుతూ కొన్ని ఉచిత సలహాలిచ్చారు. ముఖ్యంగా మొండితనంగా వ్యవహరించే భార్యలను భర్తలు ఎలా దారికి తెచ్చుకోవాలో చెప్పారు.

మీ భార్యను మార్చడం కోసం భర్తగా మీరెంత ప్రయత్నిస్తున్నారో ఆమెకు తెలియజేయాలని పేర్కొన్నారు. అప్పటికీ కుదరకపోతే.. మూడు రోజుల పాటు విడిగా పడుకోవాలని సూచించారు. అయినప్పటికీ ఆమె మారకపోతే.. మీ మాట వినకపోతే.. మీరెంత కఠినంగా ఉంటారో చెప్పేందుకు ఆమెను సున్నితంగా దండించాలని చెప్పారు. అలాగే భార్యలకూ కొన్ని సలహాలిచ్చారు. భర్తలు మౌనంగా ఉన్న సమయంలో.. లేదా తినే సమయంలో.. లేదా రిలాక్స్ అవుతున్న సమయంలోనే వారితో మాట్లాడాలని... అది కూడా వారి అనుమతి తీసుకున్నాకే అని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

మంత్రి సితీ జైలా మహమ్మద్ చేసిన ఈ వ్యాఖ్యలపై మలేషియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సితీ జైలా వ్యాఖ్యలు సిగ్గుచేటని.. ఒకరిని దండించే హక్కు మరొకరికి లేదని అంటున్నారు. వెంటనే సితీ జైలా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Amazon Sale: అమెజాన్ ఎలక్ట్రానిక్ సేల్.. హెడ్ ఫోన్స్ పై 86 శాతం డిస్కౌంట్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News