Boris Johnosn Resign: సంచలనం... యూకె ప్రధాని బోరీస్ జాన్సన్ రాజీనామా...!

Boris Johnosn Resign: సొంత ప్రభుత్వం నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ తన పదవి నుంచి తప్పుకున్నారు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 7, 2022, 05:03 PM IST
  • బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ రాజీనామా
  • సొంత ప్రభుత్వం నుంచే తీవ్ర వ్యతిరేకత
  • మంత్రులు, పార్లమెంట్ సభ్యుల మూకుమ్మడి రాజీనామాలు
Boris Johnosn Resign: సంచలనం... యూకె ప్రధాని బోరీస్ జాన్సన్ రాజీనామా...!

UK Prime Minister Boris Johnosn Resign: బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్  తన పదవికి రాజీనామా చేశారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యుల మూకుమ్మడి రాజీనామాలతో బోరీస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని బోరీస్ జాన్సన్ నిర్ణయించారు. బోరీస్ రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఆయన ఇప్పటికే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.  

బోరీస్ వైఖరికి నిరసనగా ఆర్థికమంత్రిగా రిషి సునాక్, ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్‌లు తమ పదవుల నుంచి తప్పుకోవడంతో రాజీనామాల పర్వం మొదలైంది. ఈ ఇద్దరు రాజీనామా చేసిన 24 గంటల్లోనే దాదాపు 40 మంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. బోరీస్‌కు అత్యంత విధేయులుగా ఉన్న హోం సెక్రటరీ ప్రీతి పటేల్, ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ గ్రాంట్ షాప్స్ సైతం ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు.

బోరీస్ ఇలా సొంత ప్రభుత్వం నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి పార్టీ గేట్ వ్యవహారం. రెండు మాజీ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్‌పై లైంగిక ఆరోపణల వ్యవహారాన్ని లైట్ తీసుకోవడం. పార్టీ గేట్ వ్యవహారంలో.. ఓవైపు దేశమంతా లాక్‌డౌన్ అమలులో ఉండగా మరోవైపు బోరీస్ జాన్సన్ పార్టీల్లో మునిగితేలారనే ఆరోపణలున్నాయి. ఇక క్రిస్ పించర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా బోరీస్ జాన్సన్ అతన్ని డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమించారని సొంత పార్టీ అయిన కన్జర్వేటివ్ నేతల నుంచే తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు తోడు పాలనా పరంగానూ బోరీస్ విధానాలపై సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దీంతో బోరీస్ జాన్సన్ ప్రధానిగా తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీకి తెలుగు అభిమానుల స్పెషల్ బ‌ర్త్ డే గిఫ్ట్‌.. 41 అడుగుల భారీ కటౌట్!  

Also Read: Chinthamaneni Prabhakar: కోడి పందేల కేసుపై చింతమనేని రియాక్షన్.. వైసీపీకి గట్టి వార్నింగ్..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News