Greenland: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలా కొంటావో మేమూ చూస్తాం.. ట్రంప్‌కు డెన్మార్క్ మాస్‌ వార్నింగ్‌! నెక్ట్స్ ఏం జరగబోతోంది?

Greenland: వచ్చేఏడాది జనవరిలో అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అధికార పగ్గాలు చేపట్టకుముందే తన ప్రణాళికలను దూకుడుగా అమలు చేస్తున్నారు ట్రంప్. ఇప్పటికే తన ప్రభుత్వంలో ఉండే అధికారులను, మంత్రులను నిర్ణయించుకున్న ట్రంప్..తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే తీసుకోబోయే నిర్ణయాలను కూడా వరుసగా వెల్లడిస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా పనామా కాలువపై నియంత్రణ సాధిస్తామని ప్రకటించారు. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ దీవినీ కొనేసి తమ నియంత్రణలోకి తీసుకువచ్చుకుంటామని వెల్లడించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు డెన్మార్క్ ప్రధాని మాస్ వార్నింగ్ ఇచ్చారు.   

Written by - Bhoomi | Last Updated : Dec 25, 2024, 05:00 PM IST
Greenland: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలా కొంటావో మేమూ చూస్తాం.. ట్రంప్‌కు డెన్మార్క్ మాస్‌ వార్నింగ్‌! నెక్ట్స్ ఏం జరగబోతోంది?

Greenland: జాతీయవాదిగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా మొదటినినాదంతోనే ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. గతంలో అధ్యక్షుడిగా పని చేసిన సమయంలోనూ జాతీయవాదిగా పేరు తెచ్చుకున్నారు ట్రంప్. మరోసారి తనను గెలిపిస్తే అదే నినాదంతో పనిచేస్తానని చెప్పి మీర ఓట్లు వేయించుకున్నాడు. దీంతో అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికాను ఆర్ధికంగా, భౌగోలికంగా, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు ట్రంప్. దీనిలో భాగంగానే పనామా కాలువపై నియంత్రణ తీసుకుంటామంటూ ప్రకటించారు ట్రంప్. 

ఇదే క్రమంలో తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ ల్యాండ్ ను కొనేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని ట్రంప్ ప్రకటించారు. జాతీయ భద్రత, స్వేచ్ఛ ప్రయోజనాలకోసం గ్రీన్ ల్యాండ్ యాజమాన్యం, నియంత్రణ ఒక సంపూర్ణ స్వయంప్రతిపత్తి కలిగిన స్వయంపాలనను కలిగి ఉన్నప్పటికీ అది ఇప్పటికీ డెన్మార్క్ రాజ్యంగా భాగం. దీంతో ఆ దీవిపై నియంత్రణను ట్రంప్ కోరుకుంటున్నారు. 

అయితే గ్రీన్‌ల్యాండ్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల తర్వాత డెన్మార్క్ సన్నాహాలు ప్రారంభించింది. గ్రీన్‌ల్యాండ్‌కు రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుతున్నట్లు డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికాకు యాజమాన్యం, నియంత్రణ ఉండటం అవసరమని అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన  కొన్ని గంటల తర్వాత, గ్రీన్‌ల్యాండ్‌పై రక్షణ వ్యయాన్ని పెంచుతున్నట్లు డెన్మార్క్ ప్రకటించింది. రక్షణ ప్యాకేజీ గురించి సమాచారం ఇస్తూ, ఇది కనీసం 1.5 బిలియన్ డాలర్లు (127.89 బిలియన్ భారతీయ రూపాయలు) ఉంటుందని డెన్మార్క్ రక్షణ మంత్రి చెప్పారు. ప్యాకేజీ ప్రకటించడం కాలయాపన అని ఆయన అన్నారు.

ప్యాకేజీ రెండు కొత్త నెస్పెక్షన్ నౌకలు, రెండు కొత్త లాంగ్ రేంజ్ డ్రోన్స్, రెండు అదనపు డాగ్ స్లెడ్ ​​బృందాలను కొనుగోలు చేస్తుందని పౌల్సెన్ చెప్పారు. ఇది గ్రీన్‌లాండ్ రాజధాని న్యూక్‌లో ఆర్కిటిక్ కమాండ్ సిబ్బంది సంఖ్యను పెంచడం.. F-35 ఫైటర్ జెట్‌ల కోసం ద్వీపం  మూడు ప్రాథమిక పౌర విమానాశ్రయాలలో ఒకదానిని అప్‌గ్రేడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.అయితే గ్రీన్‌ల్యాండ్ ప్రణాళికలో లోపాలను పౌల్సెన్ అంగీకరించారు. మేము చాలా సంవత్సరాలుగా ఆర్కిటిక్‌లో తగినంత పెట్టుబడి పెట్టలేదు. మేము ఇప్పుడు బలమైన ఉనికి కోసం ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. 

Also Read: Business ideas: ఈ కోళ్లను పెంచి..అమ్మితే ఎంత లాభమో తెలుసా? సాఫ్ట్‌వేర్‌ జాబ్‌కు మించిన ఆదాయం మావా  

గ్రీన్లాండ్ స్వయంప్రతిపత్తి కలిగిన డానిష్ భూభాగం. ఉత్తర అమెరికా నుండి ఐరోపాకు అతి చిన్న మార్గంలో ఉన్న ఈ భారీ ద్వీపం అమెరికాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇక్కడ ఒక పెద్ద అమెరికన్ స్పేస్ సౌకర్యం ఉంది. దీనితో పాటు, ఈ ప్రాంతం ప్రధాన ఖనిజ నిక్షేపాలతో నిండి ఉంది. 

అయితే ట్రంప్ వ్యాఖ్యలతో అలర్ట్ అయిన డెన్మార్క్...గ్రీన్ ల్యాండ్స్ కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. గ్రీన్ ల్యాండ్ ప్రధాని కూడా స్పందిస్తూ తాము అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేమంటూ వార్నింగ్ ఇచ్చారు. డెన్మార్క్, గ్రీన్ ల్యాండ్ వ్యాఖ్యలతో ట్రంప్ కు ఇప్పుడు బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. ట్రంప్ నెక్ట్స్ తీసుకోబోయే నిర్ణయం ఏంటనే ఉత్కంఠ  రేపుతోంది.

Also Read:Pension: రైతులకు అదిరిపోయే వార్త చెప్పిన మోదీ సర్కార్..నెలకు రూ. 3వేల పెన్షన్..ఇలా అప్లయ్ చేసుకోండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News