అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అత్యున్నత శాంతి పురస్కరం నోబెల్ శాంతి బహుమతి-2021కి నామినేట్ అయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చినందుకుగానూ అమెరికా అధ్యక్షుడి పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెడ్డే నామినేట్ చేశారు. పార్లమెంట్‌లో నాలుగుసార్లు సభ్యుడిగానూ ఉన్న ట్రిబిడ్రే, నాటో పార్లమెంటరీ అసెంబ్లీకి ప్రతినిధిగా సేవలందిస్తున్నారు. AP: మద్యం వినియోగంలో 65 శాతం తగ్గుదల
రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల మధ్య సైతం శాంతిని నెలకొల్పాలని ఆశిస్తూ ట్రంప్ పేరును నామినేట్ చేసినట్లు పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్నందుకు సైతం ట్రంప్‌ను ప్రశంసించారు. గతంలో 2018లోనూ ట్రంప్ పేరును టైబ్రింగ్ జెడ్డే నామినేట్ చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మరోసారి ట్రంప్ పేరు నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ కావడం విశేషం. Kagiso Rabada: IPL 2020 టైటిల్ నెగ్గుతాం: బౌలర్ రబాడ
2009లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బరాక్ ఒబామా నోబెల్ శాంతి పురస్కారం పొందడం తెలిసిందే. తాజాగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును శాంతి పురస్కారానికి నామినేట్ చేశారు. Ananya Pandey Photos: అందాల భామ అనన్య గ్లామరస్ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR