Donald trump last day: అమెరికా అధ్యక్షుడిగా చివరిరోజు గడుపుతున్నారు డోనాల్డ్ ట్రంప్. అందుకే చిట్ట చివరిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టి సంచలనం రేపారు.
అమెరికా ( America ) లో ఓ సంస్కృతి ఉంది. వివిధ నేరాల్లో శిక్ష పొందుతున్నవారికి క్షమాభిక్ష పెట్టడమనేది. అయితే సాధారణంగా పదవి నుంచి దిగిపోయేముందు క్షమాభిక్ష పెడుతుంటారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) కూడా ఇప్పుడు అదే చేశారు. అధ్యక్షుడిగా చివరి రోజు గడుపుతున్న ట్రంప్..కీలకమైన ఆ నిర్ణయం తీసుకున్నారు. పదవి నుంచి దిగిపోతూ..ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టారు. మరో 70 మందికి శిక్షలు తగ్గించారు. తీవ్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఆయన సన్నిహితుడు, మాజీ సలహాదారుడైన స్టీవ్ బ్యానన్ ( Steve Bannon ) కు సైతం క్షమాభిక్ష పెట్టడం సంచలనంగా మారింది.
ప్రజల్ని మోసం చేసి దాతల నుంచి ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధుల్ని సేకరించారని..అందులో అధిక భాగాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం వినియోగించారని స్టీవ్ బ్యానన్ పై ఆరోపణలున్నాయి. అమెరికా మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం ( America Mexico Wall Construction ) కోసం సేకరించిన విరాళాల్లో అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. 2016 ఎన్నికల్లో ట్రంప్ సలహాదారుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా స్టీవ్ బ్యానన్ పనిచేశారు. బ్యానన్ చాలా ముఖ్యమైన నాయకుడని..రాజకీయాల్లో మంచి అవగాహన ఉందని డోనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
మరోవైపు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని ఆరోపణలెదుర్కొన్న లిల్ వెయిన్, కోడక్ బ్లాక్ లకు కూడా ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. అవినీతి ఆరోపణలెదుర్కొన్న క్విల్ పాట్రిక్ ను కూడా క్షమించారు. వాస్తవానికి ఇప్పుడే కాదు గానీ..గత కొద్దికాలంగా ట్రంప్ తన సన్నిహితులు చాలామందికి క్షమాభిక్ష ( Mercy )పెడుతూ వస్తున్నారు. మరి కొంతమంది శిక్షల్ని తగ్గించారు.
Also read: US Vaccination: జో బిడెన్ కొత్త ప్రణాళిక..వందరోజుల్లో పది కోట్లమందికి వ్యాక్సినేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook