Hawaii Wildfire: హవాయి దీవుల్లో భయంకర కార్చిచ్చు, 36 మంది సజీవ దహనం

Hawaii Wildfire: ప్రకృతి ఆగ్రహిస్తే జరిగే విధ్వంసం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అమెరికాలో భీకర తుపాను బీభత్సం సృష్టిస్తుంటే..హవాయి దీవుల్లో మాత్రం అగ్నీకీలలు ఎగసిపడ్డాయి. భారీగా ప్రాణనష్టం సంభవించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 10, 2023, 09:30 PM IST
Hawaii Wildfire: హవాయి దీవుల్లో భయంకర కార్చిచ్చు, 36 మంది సజీవ దహనం

Hawaii Wildfire: ప్రకృతి విపత్తు అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇందులో కార్చిచ్చు అత్యంత భయంకరమైంది. ఇండియాలో ఎప్పుడూ ఎదురు కాలేదు కానీ ఇతర దేశాల్లో చాలా ఎక్కువగా సంభవిస్తుంటుంది. సాధారణంగా అడవుల్ని చుట్టుముట్టే కార్చిచ్చు..ఊర్లను కూడా తగలబెట్టేస్తోంది. 

హవాయి దీవులు కార్చిచ్చుతో వణికిపోతున్నాయి. నలువైపుల్నించి చుట్టుముట్టిన అగ్నీకీలలకు పెనుగాలులు తోడవడంతో తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కార్చిచ్చు కారణంగా 36 మంది దహనమయ్యారు. హరికేన్ కారణంగా గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కార్చిచ్చిు అంతకంతకూ వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. మౌయి ద్వీపంలోని రిసార్ట్ నగరం లహైనా కార్చిచ్చుకు కాలి బూడిదైపోయింది. ఇప్పటి వరకూ 36 మంది మరణించినట్టు తెలుస్తున్నా..ఇంకా పెద్ద సంఖ్యలో జనం మరణించి ఉండవచ్చని అంచనా. వాస్తవానికి ఈ కార్చిచ్చు అడవుల్లో మొదలైంది. పెనుగాలుల కారణంగా శరవేగంగా వ్యాపించి లహైనా నగరాన్ని చుట్టేసింది. ప్రస్తుతం హవాయి దీవుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇప్పటి వరకూ చాలా రకాల విపత్తుల్ని ఎదుర్కొన్నా..ఈ తరహాలో ఇంత భయంకరమైన విపత్తు ఇదే తొలిసారిగా స్థానికులు చెబుతున్నారు. చాలామంది మంటలు, పొగ నుంచి రక్షించుకునేందుకు సముద్రంలో దూకేశారు. ఊరి మధ్యలో బాంబు పడితే ఎలా ఉంటుందో అలా తయారైంది లహైనా నగరం. హవాయి దీవుల్లో అతిపెద్ద ద్వీపంగా మౌయిని పిలుస్తారు. ఇది సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతం.  వేల ఎకరాల్లో పంట పొలాలు దగ్దమయ్యాయి. కార్లు, వాహనాలు, ఇళ్లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.

ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటల్లో చాలా భవనాలు దెబ్బతిన్నాయి. కార్లు కాలి బూడిదగా మారాయి. హవాయి దీవుల్లోని పశ్చిమ భాగానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.16 రోడ్లను మూసివేశారు. ఇప్పటి వరకూ 217 భవంతులు ధ్వంసమయ్యాయి. అంతకంతకూ ఎగసిపడుతున్న అగ్నీకీలల్ని అదుపు చేసేందుకు పెద్దఎత్తున సహాయక చర్చలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఈ కార్చిచ్చు అదుపులో రాకపోతే ఇతర దీవులకు కూడా విస్తరించే ప్రమాదం లేకపోలేదు.

Also read: US Cyclone: అమెరికాను వణికిస్తున్న భారీ తుపాను, అంధకారంలో ఉత్తర అమెరికా రాష్ట్రాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News