India vs Maldives: ఇండియా-మాల్దీవుల మధ్య రక్షణ ఒప్పందానికి కారణమేంటి..ఒప్పందం విలువ ఎంత

India vs Maldives: ఇండియా-మాల్దీవుల మధ్య కీలకమైన రక్షణ ప్రాజెక్టులపై ఒప్పందమైంది. 50 మిలియన్ డాలర్ల విలువ చేసే రక్షణ ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశాయి. ఇండియా ఎప్పటికీ మాల్దీవులకు నమ్మకమైన రక్షణ భాగస్వామి అని విదేశాంగ మంత్రి జై శంకర్ వెల్లడించారు.

Last Updated : Feb 21, 2021, 03:11 PM IST
India vs Maldives: ఇండియా-మాల్దీవుల మధ్య రక్షణ ఒప్పందానికి కారణమేంటి..ఒప్పందం విలువ ఎంత

India vs Maldives: ఇండియా-మాల్దీవుల మధ్య కీలకమైన రక్షణ ప్రాజెక్టులపై ఒప్పందమైంది. 50 మిలియన్ డాలర్ల విలువ చేసే రక్షణ ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశాయి. ఇండియా ఎప్పటికీ మాల్దీవులకు నమ్మకమైన రక్షణ భాగస్వామి అని విదేశాంగ మంత్రి జై శంకర్ వెల్లడించారు.

మాల్దీవుల రక్షణపై నిబద్ధతను భారతదేశం మరోసారి చాటిచెప్పింది. మాల్దీవుల ( Maldives ) సముద్ర సామర్ధ్యం పెంచుకునేందుకు అవసరమైన రక్షణ ప్రాజెక్టుల కోసం ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏకంగా 50 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు అంటే డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందంపై ఇండియా తరపున విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ( Foreign minister jai sankar ), మాల్దీవుల తరపున ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మరియా దీదీ సంతకాలు చేశారు. 

ఇండియా, మాల్దీవులకు సంబంధించిన 50 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ఒప్పందం మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య జరిగింది. మాల్దీవుల రక్షణ మంత్రి మరియా దీదీ ( Maria didi ), ఆర్థిక మంత్రి ఇబ్రహీం అమీర్, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి ఫయాజ్ ఇస్మాయిల్, జాతీయ ప్రణాళిక, గృహ, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మొహమ్మద్ అస్లాంతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందంపై సంతకాలయ్యాయి. మాల్దీవుల్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న జైశంకర్.. ఆ దేశ రక్షణ మంత్రితో స్నేహపూర్వక సమావేశం జరిపారు. రక్షణ సహకారంపై ఉపయోగకరమైన మార్పిడి అని, భారతదేశం ఎప్పుడూ మాల్దీవులకు నమ్మకమైన రక్షణ భాగస్వామిగా ఉంటుందని జైశంకర్ ట్వీట్ చేశారు. యూటీఎఫ్ హార్బర్ ప్రాజెక్ట్ ఒప్పందంపై రక్షణ మంత్రి మారియా దీదీ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేయడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఈ ఒప్పందం మాల్దీవుల కోస్ట్ గార్డ్ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని, ప్రాంతీయ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ప్రయత్నాలను సులభతరం చేస్తుందని జైశంకర్‌ తెలిపారు. అభివృద్ధిలోనే కాకుండా రక్షణలో కూడా మాల్దీవులతో భాగస్వామి కావడం సంతోషదాయకమన్నారు.

Also read: Jeff Bezos: మళ్లీ ప్రపంచ కుబేరుడిగా Amazon Chief జెఫ్ బెజోస్, స్వల్ప వ్యత్యాసంతో అగ్రస్థానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News