Indigo Air Hostess Surabhi: అందరూ తమ జీవితాల్లో చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణంలో భాగంగా వీడ్కోలు చెప్పడం ఓ ఆనవాయితీ. ఈ వీడ్కోలు అందరి జీవితాల్లోనూ ఎల్లప్పుడూ కష్టమైన భాగంగానే ఉంటుంది. ప్రయాణంలో వీడ్కోలు చెప్పడం అందరికీ కష్టతరమే. అయితే అలాంటి ఓ వీడ్కోలుకు సంబంధించిన ఇండిగో ఎయిర్ హోస్టెస్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఓ ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగ పరిమితి సమయం ముగియడంతో.. ప్రయాణికులు, సిబ్బందిని ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతూ.. ఎయిర్ హోస్టెస్ సురభి ఈ విధంగా మాట్లాడారు. "ఈ రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ పని నాకు చాల ఇష్టమైనది (కన్నీటి పర్యంతమవుతూ..). ఈ సందర్భంగా నాతోటి ఉద్యోగుల సహాయాన్ని నేను మరువలేను. అదే విధంగా ఇండిగో సంస్థ నాకు కావాల్సిన అవసరాలను సమకూర్చింది. అలాంటి సంస్థలో నేను పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మా సంస్థ సిబ్బందిని చాలా బాగా చూసుకుంటుంది. నాకు ఇక్కడి నుంచి వెళ్లాలని లేకున్నా.. ఉద్యోగ వయోపరిమితి కారణంగా తప్పక వెళ్లాల్సి వస్తుంది" అని ఎయిర్ హోస్టెస్ సురభి అన్నారు.
అలాగే తాను ప్రయాణికులకు కృతజ్ఞతలు ఎయిర్ హోస్టెస్ సురభి.. మాతో ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలను తెలియజేశారు. మీ వల్లే (ప్రయాణికులు) మేము ఈ స్థాయిలో ఉండి మంచి జీతాలు పొందుతున్నామన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వీడియోపై ఓ ప్రయాణికుడు అలెగ్జాండ్రా కామెంట్ ద్వారా స్పందించారు. ఎయిర్ హోస్టెస్ సురభి భవిష్యత్తు ప్రణాళికలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ ప్రయాణికుడు స్పందిస్తూ..సురభి నాయర్ సేవలు చాలా సార్లు పోందానని తెలిపారు. ఆమెతో ప్రయాణించే ప్రయాణికులతో నవ్వుతూ అందరిని పలకరిస్తూ ఉండేదని తాను వివరించారు. ఇండిగోలో తాను అందించిన సేవలు విలువ కట్టలేనివని అన్నారు. తాను భవిష్యత్‌లో మంచి స్థాయిలో ఉండాలని వారు కోరుకున్నారు. ఈ వీడియోని చూసిన నేటిజన్లు సురభి నాయర్‌కు భవిష్యత్‌లో మంచి స్థానంలో నిలవాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Read Also: Viral News: పెరిగిన నిమ్మకాయ, ఎండుమిర్చి ధరలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!
Read Also: Ryan Campbell Heart Attack: ప్రముఖ హెడ్ కోచ్‌కు గుండెపోటు..లండన్ లోని హాస్పిటల్‌లో చేరిక..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook