Israel-Hezbollah war: ఈ వీడియో చూస్తే హిజ్బుల్లా నేతలకు తడిసిపోతుందేమో.. వామ్మో ఇంత భయంకరమా?

Israel war: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం గత ఏడాది అక్టోబర్ లో మొదలైంది. హమాస్ లక్ష్యంగా గాజాను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ గురి ఇప్పుడు హిజ్బుల్లా మీద పడింది. గత వారం నుంచి హిజ్బుల్లాను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు హిజ్బుల్లా నేతలకు వెన్నులో వణుకుపుట్టేలా ఉంది. 

Written by - Bhoomi | Last Updated : Sep 26, 2024, 11:15 PM IST
Israel-Hezbollah war: ఈ వీడియో చూస్తే హిజ్బుల్లా నేతలకు తడిసిపోతుందేమో.. వామ్మో ఇంత భయంకరమా?

Israel Video: లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దాడులు ప్రారంభమైన ఐదు రోజుల్లోనే లెబనాన్ లో 90 వే మంది నిరాశ్రులయ్యారు. గతేడాది మొదలైన ఈ యుద్ధం..హమాస్ లక్ష్యంగా గాజాను మట్టుబెట్టింది. సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఇప్పుడు గురి హిజ్బుల్లా మీదకు మళ్లింది. గతవారం నుంచి హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడుతోంది. గతవారం కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ధ్వంసం చేసింది. పేజర్లు, వాకీటాకీలను పేల్చింది. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఈ వారం ప్రారంభంలోనే సోమవారం 600రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో దాదాపు 557 మంది మరణించారు. దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

 ఇక తాజాగా దాడులను మరింత ఉద్ధ్రుతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఒక వీడియోను సైతం విడుదల చేసింది. ఈ వీడియోలో ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తే హిజ్బుల్లా నేతలు ఒంటరికి వాష్ రూమ్ కు వెళ్లేందుకు కూడా భయపడతారమో అన్నట్లుగా ఉంది. లెబనాన్ పై చేస్తున్న దాడుల తీరును వివరిస్తూ ఇజ్రాయోల్ ఆర్మీ ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా ఈ వీడియోను విడుదల చేసింది. యుద్ధ విమానాలతో స్థావరాలను ధ్వంసం చేస్తున్న తీరు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది.  ఈ వీడియోను మీరు చూడాలని కానీ, షేర్ చేయాలని కానీ హిజ్బుల్లా కోరుకోదు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 

హిజ్బుల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయోల్ రాకెట్ దాడులు చేస్తూనే ఉంది. హిజ్బుల్లా నేతుల, పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటుందంటూ ఇజ్రాయెల్ ఆరోపణలు చేస్తోంది. నివాస సముదాయాల్లో భారీగా ఆయుధాలను దాచిపెట్టినట్లుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. దక్షిణ లెబనాన్ అడ్డగా హిజ్బుల్లా కార్యకలాపాలను విస్తరించినట్లు ఇజ్రాయెల్ కనిపెట్టింది. అందుకే హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకుపోతోంది. 

Also Read: Israel strikes Lebanon: హిజ్బుల్లాకు మరో దెబ్బ.. వైమానిక దాడిలో డ్రోన్ కమాండ్ హతం   

గత 20 ఏళ్లుగా దక్షిణ లెబనాన్‌లోని జనావాస ప్రాంతాల్లో హిజ్బుల్లా తన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మిస్తోందని, ఇజ్రాయెల్‌పై దాడులకు ఆ ప్రాంతాన్ని లాంచ్‌ప్యాడ్‌గా మార్చిందని IDF ఒక వీడియోను విడుదల చేసింది. కచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా వందలాది హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసి హిజ్బుల్లాకు వ్యతిరేకంగా రక్షణాత్మక చర్యను ప్రారంభించినట్లు IDF నివేదించింది. ఇజ్రాయెల్ ఈ దాడులు హిజ్బుల్లా  ప్రణాళికాబద్ధమైన దాడులను అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఇందులో వారు దాచిన ఆయుధాలను ఉపయోగించి ఇజ్రాయెల్ ఇళ్లపై దాడి చేయాలని యోచిస్తున్నారని పేర్కొంది. "ఇజ్రాయెల్ కుటుంబాలు సురక్షితంగా తమ ఇళ్లకు తిరిగి వచ్చేలా చూడడమే మా లక్ష్యం" అని IDF ప్రకటన పేర్కొంది.

కాగా గురువారం  జరిగిన తాజా దాడుల్లో, ఇజ్రాయెల్ బీరూట్‌కు దక్షిణాన పొరుగున ఉన్న హిజ్బుల్లా కమాండర్ రహస్య స్థావరంపై బాంబులు వేసింది. వార్తా సంస్థ AFP ప్రకారం, హిజ్బుల్లా కమాండర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని హిజ్బుల్లాకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత వారంలో ఈ ప్రాంతంలో హిజ్బుల్లా కమాండర్లపై ఇది నాలుగో దాడి.

Also Read:  PM Modi: సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x