కేఎఫ్‌సీలు బంద్.. వారం వరకు ఇలానే

చికెన్‌ కొరతతో కేఎఫ్‌సీ రెస్టారెంట్లు మూతబడ్డాయి.

Updated: Feb 20, 2018, 04:51 PM IST
 కేఎఫ్‌సీలు బంద్.. వారం వరకు ఇలానే

చికెన్‌ కొరతతో కారణంగా యూకేలో వందలాది కేఎఫ్‌సీ రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఇప్పటి వరకు చికెన్‌ను సరఫరా చేస్తున్న జర్మనికి చెందిన ప్రముఖ కొరియర్‌ సంస్థ డీహెచ్‌ఎల్‌తో కేఎఫ్‌సీలు ఒప్పందం రద్దుచేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

‘ఇటీవల ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. ఆ కంపెనీ సరఫరాలో కొన్ని సమస్యలు వచ్చాయి. యూకే వ్యాప్తంగా ఉన్న 900 రెస్టారెంట్లకు చికెన్‌ సరఫరా చేయడం కష్టమైంది. ఈ క్రమంలోనే కొన్ని రెస్టారెంట్లు మూతపడాల్సి వచ్చింది’ అని కేఎఫ్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది.

నాణ్యత విషయంలో కంపెనీ  రాజీ పడదని, ఈ వారం చివరి వరకు ఇలానే మూసివేసుంటాయని కంపెనీ ప్రకటించింది. మిగిలిన రెస్టారెంట్లలో పరిమిత మెనూ, కొన్ని గంటలే సేవలందిస్తున్నట్లు తెలిపింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.