Earthquake Today: టిబెట్-నేపాల్ సరిహద్దులో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు 53 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 7.1 నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకారం.. నేపాల్‌లోని లోబుచేకి ఈశాన్యంగా 93 కి.మీ దూరంలో టిబెట్ ప్రాంతంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన భూకంపం బీహార్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో భూమి కంపించింది. భూకంప కేంద్ర ప్రాంతం దాదాపు 4,200 మీటర్లు (13,800 అడుగులు) ఎత్తులో ఉందని చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ వెల్లడించింది.
Also Read: Allu Arjun: శ్రీతేజ్ కండిషన్ సీరియస్..! నేడు అల్లు అర్జున్ పరామర్శ..
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి, జల్‌పైగురి, కూచ్ బెహార్‌లో మంగళవారం ఉదయం భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. బెంగాల్‌లోని సిలిగురిలో ఉదయం 6:37 గంటలకు భూమి 15 సెకన్ల పాటు కంపించగా.. జల్‌పైగురిలో ఉదయం 6.35 గంటలకు భూకంపం సంభవించింది. బెంగాల్‌తో పాటు బీహార్ రాజధాని పాట్నాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో కూడా జనవరి 7వ తేదీన రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 1994లో ఇదే రోజున అమెరికా, 1995లో జపాన్ భారీ భూప్రకంపనలు వచ్చాయి. లాస్ ఏంజిల్స్‌లో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ భూకంపం కారణంగా 25 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. 1995లో జపాన్‌లోని కోబ్ (కో-బే) నగరంలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 6 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు.
Also Read: HMPV: చైనా వైరస్ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రిలో సర్వం సిద్ధం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.