పాకిస్తాన్ సహాయం కావాలి: ట్రంప్ సర్కార్

పాకిస్తాన్ దేశంలో తాము ఎలాంటి మిలట్రీ యాక్షన్స్ చేపట్టమని.. వీలైతే దక్షిణాసియాలో టెర్రరిజాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ సహాయం తీసుకుంటామని అమెరికన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పెంటగన్ ప్రకటించింది. 

Last Updated : Feb 2, 2018, 06:05 PM IST
పాకిస్తాన్ సహాయం కావాలి: ట్రంప్ సర్కార్

పాకిస్తాన్ దేశంలో తాము ఎలాంటి మిలట్రీ యాక్షన్స్ చేపట్టమని.. వీలైతే దక్షిణాసియాలో టెర్రరిజాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ సహాయం తీసుకుంటామని అమెరికన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పెంటగన్ ప్రకటించింది. భౌగోళికంగా పాకిస్తాన్ ఎన్నో దేశాలకు దగ్గరగా ఉందని.. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌లో సైతం ఉగ్రవాదాన్ని అణచివేయాలని తాము భావించినప్పుడు.. పాకిస్తాన్ సహాయాన్ని కోరామని పెంటగన్ తెలిపింది.

అయితే కొన్ని సందర్భాల్లో పాక్ తీరు తమకు నచ్చలేదని.. ఒకవైపు ఈ దేశం టెర్రరిజం వల్ల బాధలు పడుతున్నా.. మరోవైపు వాటిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని పెంటగన్ అభిప్రాయపడింది. ఇటీవలే ఇదే కారణంతో అమెరికన్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి 2 బిలియన్ డాలర్ల సెక్యూరిటీ ఎయిడ్‌ను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 

కొత్త సంవత్సరం సందర్భంగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ పాకిస్తాన్ వల్ల అమెరికాకి ఒరిగేదేమీ లేదని.. ఆ దేశం ఒక అబద్ధాల కోరని చెప్పిన విదితమే. గత 15 సంవత్సరాలుగా దాదాపు 33 బిలియన్ డాలర్లను పాకిస్తాన్‌కు అమెరికా సెక్యూరిటీ ఎయిడ్ క్రింద ఇచ్చిందని.. అయితే స్నేహధర్మాన్ని మరిచి టెర్రరిస్టులకు ఆ దేశం వత్తాసు పలుకుతూ.. తమ రాజ్యంలో చోటు ఇస్తుందని ట్రంప్ ఆరోపించారు. 

Trending News