పాక్ సరికొత్త ఎత్తుగడ; భారత్ పై ఎఫ్ఎం ప్రయోగానికి రంగం సిద్ధం !!

భారత్ పై ఎన్ని  ప్రయెగాలు  చేస్తున్న విఫలమైతున్న పాక్..ఇప్పుడు తాజాగా సరికొత్త ఎత్తుగడను సిద్ధం చేసింది

Last Updated : Aug 29, 2019, 12:50 AM IST
పాక్ సరికొత్త ఎత్తుగడ; భారత్ పై ఎఫ్ఎం ప్రయోగానికి రంగం సిద్ధం !!

ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టడంలో ఈ మధ్య పాక్ దళాలకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాక్ సర్కార్ షాక్ కు గురైంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న పాక్... భారత్ ను దెబ్బకొట్టేందుకు సరికొత్త ఎత్తుగడకు తెరలేపింది. 

ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఇండో పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఎంఎం రేడియా స్టేషన్లు ఏర్పాటుకు ఇమ్రాన్ సర్కార్ స్కెచ్ రెడీ చేసింది. ఎఫ్ఎం రేడియా నుంచి పాక్ అనుకూల ప్రసారాలు, భారత్ గురించి తప్పుడు సమాచారం అందించి భారత సరిహద్దు ప్రాంతాల ప్రజలతో పాటు భారత సైనికులకు తప్పుదోవ పట్టించాలనేది దాని ఎత్తుగడ వేస్తోంది. ఎల్ ఓసీ సమీపంలోని భారత సైనిక విభాగాలను, భారత ప్రజలను తికమక పెట్టాలన్నదే పాక్ వ్యూహంగా ఉన్నట్లు తెలిసింది

కశ్మీర్ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ భారత్ దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న పాక్ ఈ సరికొత్త ఎత్తుగడకు ప్రణాళిలకు సిద్ధం చేసింది. ఎల్ ఓసీ వెంబడి ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు చేసే బాధ్యతను పాక్ మిలిటరీ కమాండర్లకు అప్పగించారు. అంతే కాకుండా పీఓకేలో ఉన్న రేడియో స్టేషన్లను కూడా సరిహద్దు వెంబడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

అణు ప్రయోగానికే బెదరని భారత్ ..పాకిస్తాన్ ఎంఎం ప్రయోగిస్తాన్నంటే ఏం బెదురుతుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే చందంగా ఎంఎఫ్ ను అడ్డుకునేందుకు భారత్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

Trending News