PM Narendra Modi Lands In Rome To Attend G20 Summit: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి నవంబర్ 2 వరకు విదేశాల పర్యటనలో ఉండనున్నారు. ఇటలీ, యుకేలో ప్రధాని మోదీ పర్యటన ఉంటుంది. ఇటలీలో 16వ జీ 20 (16th G20 Summit) సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా మోదీ ఇటలీ (Modi in Italy) చేరుకున్నారు. ఇటలీ, బ్రిటన్ లో ఆయన ఐదు రోజులపాటు పర్యటించనున్నారు.
ఇటలీలో నేటి నుంచి అక్టోబర్ 31 వరకు (October 31) పర్యటించున్నారు. అక్టోబర్ 31న రోమ్ వేదికగా జీ-20 సదస్సు (G20 Summit) జరుగనుంది. జీ-20 సదస్సులో మోదీ పాల్గొంటారు. కరోనాతో పాటు (Covid-19) భవిష్యత్ లో వచ్చే వ్యాధులను ఎదుర్కోవడంపై చర్చ జరగనుంది. కరోనా అనంతర పరిస్థితులపైనా జీ-20 సదస్సులో చర్చించనున్నారు.
Also Read : KTR toured Station F: ఫ్రాన్స్‌లో కొనసాగుతోన్న కేటీఆర్ పర్యటన
రోమ్ లో (Rome) పలు అంతర్జాతీయ నేతలతో మోదీ భేటీ కానున్నారు. వాటికన్ లో పోప్ ఫ్రాన్సిస్ తో (Pope Francis) మోదీ సమావేశం ఉంటుంది. నవంబర్ 1, 2 తేదీల్లో బ్రిటన్ లో ప్రధాని మోదీ పర్యటిస్తారు. గ్లాస్గో (Glasgow) వేదికగా జరిగే కాప్ – 26 (COP-26) సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. వాతావరణ, పర్యావరణ మార్పులపై కాప్ – 26 (COP-26) సదస్సులో చర్చ జరుగనుంది.
ఇక ఇప్పటికే రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఈ మధ్యాహ్నం వెన్యూ పియాజా గాంధీ ప్రాంతంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత రాత్రి ఇటలీ ప్రధాని మారియో డ్రాగీతో సమావేశమవుతారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు వాటికన్ సిటీలో జరగబోయే జీ20 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, ఇండోనేషియా, సింగపూర్, జర్మనీ దేశాధినేతలతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌తో (Pope Francis) భేటీ కానున్నారు. తర్వాత మోదీ నేరుగా యూకే వెళ్లి కాప్ 26 సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బోరిస్‌తోనూ ప్రధాని భేటీ కానున్నారు. పర్యటన ముగించుకుని నవంబరు 3వ తేదీ ఉదయానికి తిరిగి దిల్లీ చేరుకుంటారు.
Landed in Rome to take part in the @g20org Summit, an important forum to deliberate on key global issues. I also look forward to other programmes through this visit to Rome. pic.twitter.com/e4UuIIfl7f
— Narendra Modi (@narendramodi) October 29, 2021
కాగా ప్రధాని మోదీ పాల్గొనబోతున్న ఎనిమిదవ జీ-20 సదస్సు ఇది. గత ఏడాది జీ-20 సదస్సు సౌది అరేబియాలో జరిగింది. అయితే అప్పుడు కొవిడ్ కారణంగా వర్చువల్ ద్వారా సమావేశం నిర్వహించారు. జీ-20 సదస్సుకు (G20 Summit) ప్రధాని మోదీ ( Prime Minister Narendra Modi) చివరిసారిగా హాజరైంది 2019లో ఒసాకాలో జరిగిన సదస్సుకు. అనంతరం రెండేళ్లకు ఇటలీలో జరగబోతున్న సమావేశానికి హాజరుకానున్నారు.
Also Read : Facebook: ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారింది.. మెటా కిందకు వచ్చిన ఫేస్‌బుక్ యాప్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook