శ్రీలంకలో తొలిసారిగా మాంసంపై నిషేధం

శ్రీలంకలో తొలిసారిగా ఓ రెండు రోజులు మాంసం అమ్మకాలపై నిషేధాన్ని విధించింది ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే.. రాబోయే బుద్ధ జయంతి వేడుకల్లో భాగంగా మాంసం దుకాణాలు అన్నీ కూడా మూసివేయాలని ప్రభుత్వం తెలియజేసింది. 

Last Updated : Apr 26, 2018, 05:44 PM IST
శ్రీలంకలో తొలిసారిగా మాంసంపై నిషేధం
శ్రీలంకలో తొలిసారిగా ఓ రెండు రోజులు మాంసం అమ్మకాలపై నిషేధాన్ని విధించింది ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే.. రాబోయే బుద్ధ జయంతి వేడుకల్లో భాగంగా మాంసం దుకాణాలు అన్నీ కూడా మూసివేయాలని ప్రభుత్వం తెలియజేసింది. గతంలో ఇలాంటి చర్యను ఎప్పుడూ సర్కారు తీసుకోలేదు. బుద్ధ జయంతి రోజున కేవలం బార్లు, రెస్టారెంట్లకు మాత్రమే శ్రీలంకలో సెలవు ప్రకటించేవారు.
 
అయితే అహింస అనే బుద్ధుని సిద్ధాంతం కాబట్టి.. ఆయన జయంతి రోజున మాంస విక్రయాలు చేయడం కూడా అనైతికమని ఈ మధ్యకాలంలో భావించి ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంది. మాంసం దుకాణాలతో పాటు సూపర్ మార్కెట్లలో లభించే ప్యాకేజ్డ్ మీట్ విక్రయాలపై ఆ రెండు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ కొత్త పద్ధతిని పాటించనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. 
 
శ్రీలంక జనాభాలో అత్యధిక శాతం మంది అనగా 70.2% ప్రజలు బౌద్ధమతాన్ని అవలంబిస్తుండగా.. 12.6% జనాభా హిందుమతాన్ని అవలంబిస్తున్నారు. అలాగే మొత్తం దేశ జనాభాలో ముస్లిములు (9.7%), క్రైస్తవులు (7.4%), ఇతరులు (0.1%) ఉన్నారు. అశోకుడి కుమార్తె అయిన సంఘమిత్ర శ్రీలంకలో బౌద్ధమతం అభివృద్ది చెందడానికి ఎంతగానో కృషి చేశారు. 

Trending News