రష్యాకు చెందిన విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో 71 మంది దుర్మరణం చెందినట్టు సమాచారం. విమానంలో 65 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
సరటోవ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏఎన్ 148 రకపు విమానం మాస్కోలోని డుమోడెడ్వో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం అర్గునోవ్ అనే గ్రామం సమీపంలో కూలిపోయింది.
ఓరస్క్ నగరానికి బయలుదేరిన ఈ విమానంలో మొత్తం 71 మంది ఉన్నారు. కాగా, ఈ ప్రమాద సంఘటనను అధికారులు ధ్రువీకరించారు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ సంఘటనపై రష్యా ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించింది. కాగా, ఈ విషాద సంఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం తెలిపారు.
Saratov Airlines flight #6W703 has crashed about 5-6 minutes after take off from Domodedovo Airport in Moscow.
During the last seconds before it crashed the aircraft was falling with up to 22,000 feet per minute.
The aircraft involved was a 7 year old Antonov An-148. pic.twitter.com/0ENfhyI9Ts
— Flightradar24 (@flightradar24) February 11, 2018
Passenger plane crashes in Moscow region, all 71 people on board perished.
Investigation to find the cause of this accident has been immediately launched.#Russia
RIPhttps://t.co/pBxgjhhEBu pic.twitter.com/bmx1EekIeZ— Enrico Ivanov ☦ (@Russ_Warrior) February 11, 2018