భార్యాభర్తలు ఇద్దరికీ ఆ హక్కు లేదు.. అతిక్రమిస్తే శిక్ష తప్పదు!

భార్య లేనప్పుడు ఆమె ఫోన్ భర్త ముట్టుకోవద్దు.. భర్త లేనప్పుడు అతడి ఫోన్ భార్య ముట్టుకోవద్దు... 

Last Updated : Apr 4, 2018, 12:55 AM IST
భార్యాభర్తలు ఇద్దరికీ ఆ హక్కు లేదు.. అతిక్రమిస్తే శిక్ష తప్పదు!

భార్య లేనప్పుడు ఆమె ఫోన్ భర్త ముట్టుకోవద్దు.. భర్త లేనప్పుడు అతడి ఫోన్ భార్య ముట్టుకోవద్దు... కాదు కూడదు అని భార్యాభార్తలిద్దరిలో ఎవరైనా ఒకరి ఫోన్‌పై మరొకరు నిఘా పెడితే ఇకపై జరిమానా చెల్లించక తప్పదు అంటోంది సౌదీ ప్రభుత్వం. అవును, సౌది అరేబియాలో కొత్తగా అమలులోకి వచ్చిన ఓ చట్టం ప్రకారం భర్యాభర్తలిద్దరు ఒకరికి తెలియకుండా మరొకరి ఫోన్‌పై నిఘా పెట్టడానికి వీల్లేదు. ఈ ఆంక్షలను అతిక్రమించి నేరానికి పాల్పడినవారికి జరిమానా విధించడంతోపాటు నేరం తీవ్రత ప్రకారం జైలు శిక్ష కూడా పడే అవకాశం వుంది. పెళ్లి కాక ముందు పరిచయాలు, పెళ్లయిన తర్వాత కొనసాగే వివాహేతర సంబంధాలు, భార్యాభర్తలకు బయటి వారితో ఎవరికి ఏ సంబంధం లేకున్నా ఏదో వుందనే అనుమానాల మధ్య కాపురాలు పేక మేడల్లా కూలిపోతుండటంతో సౌదీ అరేబియా సర్కార్ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 

పౌరుల నైతిక విలువలు కాపాడటంతోపాటు వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా వుండేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని సౌది అరేబియా ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టంతోనైనా ఒకరిపై మరొకరికి అనుమానాలు, అవమానాలు లేకుండా చేయొచ్చని అక్కడి సర్కార్ ఆశిస్తున్నప్పటికీ.. ఈ చట్టంపై అక్కడ భిన్నాభిప్రాయాలే వినిపిస్తున్నాయి. 

Trending News