Uganda school Attack: ఉగాండా స్కూల్‌పై ఉగ్రమూకల దాడి 41 మంది మృతి

Uganda school Attack: ఆఫ్రికన్ దేశం ఉగాండాలో రక్తపుటేరులు ప్రవహించాయి. ముష్కరులు ఓ పాఠశాలపై దాడి చేయడంతో అభం శుభం తెలియని విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఇది తీవ్రవాద ముఠా దాడిగా తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 18, 2023, 01:16 AM IST
Uganda school Attack: ఉగాండా స్కూల్‌పై ఉగ్రమూకల దాడి 41 మంది మృతి

Uganda school Attack: ప్రపంచంలో ఆఫ్రికా దేశాల్ని కూడా ఉగ్రవాదం వదలడం లేదు. తీవ్రవాదులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అమాయక ప్రజల్ని, అభం శుభం తెలియని పసిపిల్లల్ని కూడా బలి తీసుకుంటున్నారు. ఉగాండాలో తీవ్రవాదులు రక్తపుటేరులు ప్రవహింపజేయడమే ఇందుకు కారణం...

తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో తీవ్రవాదు ముఠా ఒకటి మారణహోమం సృష్టించింది. కాంగో సరిహద్దులోని ఎంపాడ్వే పట్టణంలో ఉన్న లుబిరిహ సెకండరీ స్కూల్లో ఏడీఎఫ్ మిలిటెంట్లు చొరబడ్డారు. ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 38 మంది విద్యార్ధులు, సెక్యూరిటీ గార్డు, ఇద్దరు స్థానిక వ్యక్తులతో కలిపి మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 6 మందిని మిలిటెంట్లు ఎత్తుకుపోయారు. దాడి అనంతరం కాంగోలోకి పారిపోయినట్టుగా ఉగాండా మిలిటరీ అధికారులు తెలిపారు. కాంగో సరిహద్దుకు ఈ స్కూలు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడీఎఫ్ అంటే అల్లైడ్ డెమోక్రటిక్ ఫోర్స్. ఈ దళం ఐసిస్‌కు అనుబంధంగా పనిచేస్తుంటుందని సమాచారం.

జూన్ 17వ తేదీ అంటే శుక్రవారం రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత దాదాపు 20 మంది మిలిటెంట్లు లుబిరిహ స్కూల్లో చొరబడి ముందు వసతి గృహానికి నిప్పంటించారు. ఆ తరువాత కొందరిని కత్తులతో నరికి చంపేశారు. 41 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకొంతమంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. తూర్పు ఉగాండాలో 1990లో అప్పటి అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఏడీఎఫ్ పుట్టింది. చాలా ఏళ్లుగా ఈ సంస్థ అజ్ఞాతంలో ఉంది. అయితే అభం శుభం తెలియని స్కూల్ పిల్లల్ని చంపడంతో అందరూ ఈ సంస్థపై విరుచుకుపడుతున్నారు. పిల్లలపై దాడి చేయడం పాశవికమంటున్నారు.

లుబిరిహా స్కూలు వసతి గృహాన్ని తగలబెట్టిన 41 మందిని చంపిన మిలిటెంట్లు హాస్టల్‌లోని ఆహారాన్ని దోచుకుని వెళ్లారు. కేవలం ఆహారం కోసమే ఈ పని చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. కేవలం ఆహారం కోసమే అయితే ఇంతమందిని పొట్టన పెట్టుకునే అవకాశాల్లేవు. ఏదేమైనా ఉగాండా పాఠశాల దాడి ఘటన ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. 

Also read: Green Card Rules: ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్, గ్రీన్‌కార్డు నిబంధనల్లో సడలింపులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x