దశాబ్దకాల పోరాట ఫలితం; మసూద్ అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటన

భారత దౌత్యం ఫలించింది. దశాబ్ద కాలం నాటి పోరాటానికి ప్రతిఫలం దక్కింది. పుల్వామాలో సైనిక వాహనంపై దాడి చేసి 40 మందికిపైగా భారత సైన్యాన్ని పొట్టనపెట్టుకున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు గట్టి షాక్ తగిలేలా చేసింది.

Last Updated : May 2, 2019, 06:14 PM IST
దశాబ్దకాల పోరాట ఫలితం; మసూద్ అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటన

జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్  మసూద్ అజాహర్ ను గ్లోబర్ టెర్రరిస్ట్ గా  ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ విషయంలో భారత్ కు ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, రష్యా దేశాలు బాటగా నిలిచాయి. మొన్నటి వరకు ఈ ప్రయత్నాలకు అడ్డుతగిలిన చైనా ..ప్రపంచం దేశాల ఒత్తిడికి తలొగ్గి దీనికి అంగీకారం తెలిసింది. ఇలా మజూద్ అజహర్ విషయంలో అడ్డుంకులు తొలగి పోవడంతో అంతర్జాతీయ ఉగ్రవాది ముద్రవేస్తూ వేసింది ఐక్యరాజ్యసమితి. ఈ విషయాన్ని భారత్ దౌత్య అధికారి అక్బరుద్దీన్ తన ట్విట్టర్ ఖాతాలో ద్వారా తెలిపారు. 

దిక్కుతోచని స్థితిలో పాక్..
మసూద్ అజాహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి  ప్రకటిస్తున్న సమయంలో ఇక ఏం చేయాలో అర్ధం కాక పాకిస్తాన్ మౌనం దాల్చింది. ఇంతకాలం  పెద్దన్న పాత్రలో ఉన్న చైనా సాయంతో పాక్ దీన్ని అడ్డుతగులుతూ వచ్చింది. ఇప్పడు ఏకంగా చైనానే అంగీకారం తెలపడంతో పాక్ సైలెంట్ అయిపోక తప్పలేదు.  ఫలితంగా ఎవరి అభ్యంతరాలు లేకుండానే ఏక పక్షంగా మసూర్ అజహర్ కు గ్లోబర్ టెర్రరిస్ట్ గా ముద్రవేశారు. 

దశాబ్దకాలం నాటి పోరాట ఫలితం
మజూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ దశాబ్ద కాలం నుంచి పోరాడుతోంది. భారత్ ఈ ప్రతిపాదన పెట్టిన ప్రతిసారి చైనా అడ్డుతగులూ వచ్చింది. పాక్ కూడా అనేక అభ్యంతరాల వ్యక్తం చేస్తూ ఇది సాధ్యపడకుండా చేసింది. అయితే ఈ సారి భారత్ దౌత్యం ఫలించింది. ఈ విషయంలో  భారత్ కు  ఫ్రాన్స్ , బ్రిటన్, అమెరికా, రష్యా అండగా నిలిచాయి. మరోవైపు ప్రపంచ దేశాల కూడా చైనాపై ఒత్తిడి చేసేలా భారత్ దౌత్యం నడిపించింది. అంతిమంగా ప్రపంచం దేశాలు ఏకమై చైనాపై వత్తిడి చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చైనా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది.

భారత్ కు ఇదో గొప్ప విజయం...
మసూద్ అజాహర్ ను గ్లోబర్ టెర్రరిస్ట్ గా ముద్రపడేలా చేసి ఐక్యరాజ్య సమితి వేదికపై  భారత్ సాధించిన గొప్ప విజయం సాధించిందని చెప్పవచ్చు . కశ్మీర్ లో దాడులకు పాల్పడిన ఓ ఉగ్రవాదికి ఐక్యరాజ్యసమితి గ్లొబల్ ట్యాగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

Trending News