వాయువేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డు నెలకొల్పిన వర్జిన్ విమానం

                         

Last Updated : Feb 21, 2019, 08:52 PM IST
వాయువేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డు నెలకొల్పిన వర్జిన్ విమానం

కమర్షియల్ పాసెంజర్ విమానాలు సాధారణంగా  గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అది గొప్ప ఘనతగా భావిస్తాం..అలాంటిది గంటకు 1300 కిలోమీటర్లు వేగంతో  దూసుకెళ్లి వర్జిన్ అట్లాంటిక్ విమానం సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో గతంలో డ్రీమ్ లైనర్ విమానం 913 కిలోమీటర్ల గత రికార్డు   తిరగరాసినట్లయింది.

ఈ బోయింగ్ తయారీ 787 డ్రీమ్ లైనర్ విమానం లాస్ ఏంజెలిస్ నుంచి లండన్ వెళుతుండగా న్యూయార్క్ గగనతలంపై ఈ మేరకు అత్యుత్తమ వేగాన్ని నమోదు చేసింది. సాధారణంగా లాస్ ఏంజెలిస్ నుంచి లండన్ వెళ్లేందుకు 10 గంటలకు పైనే సమయం పడుతుంది. అయితే ఈ విమానం 9 గంటల్లోనే గమ్యాన్ని చేరుకుంది. ఈ అసాధారణ వేగానికి జెట్ స్ట్రీమ్ కారణం అని వైమానిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు

Trending News