అసలేంటి ఈ డోక్లామ్ వివాదం.. ?

Last Updated : Aug 25, 2017, 03:26 PM IST
అసలేంటి ఈ డోక్లామ్ వివాదం.. ?

ఇటీవలి కాలంలో భారత్ - చైనాల మధ్య డోక్లామ్ వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీని కారణంగా ఇరుదేశాల సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేథప్యంలో సగటు భారతీయుడికి  ఈ వివాదం గురించి తెలుసుకొల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ వివాదం ఎందుకొచ్చింది .. దీని వెనుక ఉన్న కథేంటో ఒక్కసారి తెలుసుకుందాం..

భారత్ - చైనా- భూటన్ ఈ మూడు దేశాల మధ్యన డోక్లాన్ అనే కొండ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం తమదేనని చైనా-భూటాన్ వాదించుకుంటున్నాయి. చాలా కాలం నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. భూటాన్ అభ్యంతరాలు ఏ మాత్రం పట్టించుకోకుండా గత జూన్ నెలలో  చైనా ఏకపక్షంగా ఈ ప్రాంతంలో రోడ్డు మార్గాన్ని నిర్మించాడానికి పూనుకొంది. దీన్ని భూటాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని అనుసరించి  భూటాన్ కు భారత్  మద్దతుగా నిలిచింది. 

డోక్లామ్ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డు మార్గంతో భూటాన్ తో పాటు తమ దేశ ప్రయోజనాలకు ప్రమాదకరంగా పరిగణిస్తోందని భారత్ పేర్కొంది. అయితే భారత్,భూటన్ అభ్యంతరాలను ఏమాత్రం లెక్కచేయండా ఆ ప్రాంతంలో చైనా తన పని తాను చేసుకుపోతోంది. దీంతో భారత్ తన సైన్యాన్ని డోక్లామ్ ప్రాంతంలో మోహరించింది. దీంతో చైనా కూడా తన సైనిక దళాలను మోహరించింది. సైన్యాన్ని ఉపసంహరించుకొని చర్చలకు రావాలని భారత్ ప్రతిపాదించింది. అయితే చైనా మొండిగా వాదిస్తూ తమ సైన్యాన్ని విరమించేది లేదంటూ .. భారతే తమ సైన్యాన్ని వెనక్కి రప్పించాలని మాట్లాడుతూ యుధ్దవాతావరణాన్ని సృష్టిస్తోంది.

భారత్ దృష్టి మళ్లించే ప్లాన్..

చైనా, పాకిస్థాన్‌ ఎకనామిక్ కారిడార్ నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సరకు రవాణా చేపట్టాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనాలోని లాంఝౌ నుంచి పాకిస్తాన్‌లోని గ్వదర్‌ పోర్ట్‌ వరకు కొత్త మార్గం ఉంటుంది. కొత్తగా చేపట్టబోయే మార్గం ద్వారా ఆఫ్రికా, ఐరోపా, మధ్య ప్రాచ్య దేశాలకు సరకులు ఎగుమతి చేయాలని చైనా ఆలోచిస్తోంది. అయితే ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మించతలపెట్టింది. 

తమ అనుమతి లేకుండా తమ భూభాగంలో కారిడార్ ఎలా నిర్మిస్తారంటూ చైనాను భారత్ ప్రశ్నించింది. ఈ పరిణామం కారిడార్ నిర్మాణానికి  అడ్డంకిగా మారింది. దీంతో ఏం చేయాలనే దిక్కుతోచని స్థితి చైనా ఉంది. ఈ విషయంలో రాజా మార్గం ద్వారా కాకుండా.. దొడ్డి దారిన పాక్ కు చెందిన ఉగ్రమూకలను భారత్ వైపు ఉసిగొల్పుతోంది. దీనికి చెక్ పెట్టే విధంగా భారత్ సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో సర్జికల్ స్ట్రెయిక్స్ నిర్వహించి.. పాక్-చైనాలకు గట్టి హెచ్చరికలు పంపిన విషయం తెలిసిందే. పాక్ సరిహద్దు గుండా ఉన్న భారత్ సైనం దృష్టి మరల్చేందుకు చైనా డోక్లామ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది.

వాస్తవానికి డోక్లామ్ అనేది ఏ మాత్రం ఉపయోగం లేని కొండ ప్రాంతం.. దీని గురించి చైనా ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే భారత్ ను ఈ వివాదంలోకి లాగి పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న  భారత సైన్యం దృష్టి డోక్లామ్ వైపు మరల్చి.. తన చైనా - పాక్ కారిడార్ పూర్తి చేసుకోవాలనే చైనా వ్యూహం. ఈ వ్యూహాన్నిముందే పసిగట్టిన భారత్.. ఏ మాత్రం బెదరకుండా తనదైన శైలిలో అటు పాక్ కు..ఇటు చైనాకు గట్టిగా బదులిస్తోంది...

Trending News