ఎట్టకేలకు డోక్లామ్ వివాదం సుఖాంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ఉన్న తన బలగాలను వెనక్కి రప్పించేందుకు చైనా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 70 రోజులుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. ఈ అంశంపై భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..గత నెలలో చైనా పర్యటన సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ డోక్లాం వివాదంపై చైనా జాతీయ భద్రతా సలహాదారుతో కీలక చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల ఫలితంగా వివాదాస్పద ప్రాంతం డోక్లామ్ నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందన్నారు.
డోక్లాం వివాదం ముదురుతున్న నేపథ్యంలో భారత్ - చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఒక వేళ ఈ రెండు దేశాల మధ్య యుద్దం అనివార్యమైతే చైనాకే అధిక నష్టం జరుగుతుందని నిపుణులు అంచానా వేస్తున్నారు
చైనా, పాక్, విరుసుతున్న సవాళ్లకు భారత్ దీటుగా ఎదుర్కొంటోంది. గతంలో జరిగిన ఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకొని పదునైన వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తోంది. చైనా-పాక్‌లు భారత్‌కు ప్రధాన ముప్పుగా పరిణమించడంతో ఆయుధసంపత్తిపై దృష్టిపెట్టింది. రక్షణ రంగం దగ్గర నుంచి విదేశాంగ విధానంగా వరకు తమ పాత పద్దతులకు స్వస్తి పలికి..సరికొత్త పంథాతో ముందుకు కదులుతోంది. పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు పెరుగుతుండగా.. మరోపక్క చైనా కూడా దుందుడుకు వైఖరిని అవలంభిస్తోన్న విషయం తెలిసిందే. సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భారత్ ముందజాగ్రతతో వ్యవహరిస్తోంది.
ఇటీవలి కాలంలో భారత్ - చైనాల మధ్య డోక్లామ్ వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీని కారణంగా ఇరుదేశాల సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేథప్యంలో సగటు భారతీయుడికి ఈ వివాదం గురించి తెలుసుకొల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ వివాదం ఎందుకొచ్చింది .. దీని వెనుక ఉన్న కథేంటో ఒక్కసారి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.