'కరోనా వైరస్'.. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో అన్ని జిల్లాల్లో అలజడి రేగుతోంది.
ఏపీలో రోజు రోజుకు కొత్త కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 647 కేసులు నమోదయ్యాయి. అందులో 65 మంది చికిత్స తీసుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారు. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 17 మంది బలయ్యారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లోనే ప్రత్యేక ఐసోలేషన్ వార్డులలో 565 మంది కరోనా వైరస్ తో పోరాడుతున్నారు.
మరోవైపు కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 153 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒకే ఒక్క వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. ఈ జిల్లాలో కరోనా మహమ్మారికి నలుగురు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు తర్వాతి స్థానంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 129 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 125 మంది యాక్టివ్ గా ఉన్నారు. నలుగురు చనిపోయారు. ఇంతవరకు ఒక్కరికి కూడా నయం కాలేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..