ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. కొత్త చిత్ర పటం విడుదల

ఏపీ రాజధానిగా అమరావతికి గుర్తింపు లభించింది. ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని సర్వే ఆఫ్ ఇండియా సూచించిన తాజా చిత్రపటాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తన ట్విటర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.

Last Updated : Nov 22, 2019, 09:37 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. కొత్త చిత్ర పటం విడుదల

న్యూఢిల్లీ: ఏపీ రాజధానిగా అమరావతికి గుర్తింపు లభించింది. ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని సర్వే ఆఫ్ ఇండియా సూచించిన తాజా చిత్రపటాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తన ట్విటర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన చిత్రపటంలో ఏపీ రాజధాని అమరావతి పేరు కనిపించకపోవడం తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ మినహా దేశంలోని ఇతర 28 రాష్ట్రాలు, మరో తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు, వాటి రాజధానుల పేర్లను సూచిస్తూ ముద్రించిన ఈ చిత్రపటంలో అమరావతికి చోటుదక్కకపోవడం ఏపీ ప్రజలను అయోమయానికి గురిచేసింది. ఇప్పటికే రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేక మరోచోటుకు తరలిపోతుందా అనే స్పష్టత కరువైందనే అభిప్రాయాలు వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలోనే సరిగ్గా ఇలా జరగడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

అయితే, ఎట్టకేలకు ఈ వివాదాన్ని పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి.. సర్వే ఆఫ్ ఇండియా విభాగాన్ని అప్రమత్తం చేసి మరీ ఈ విషయంలో విజయం సాధించినట్టు తెలుస్తోంది.

Trending News