ప్రణయ్ మళ్లీ పుట్టాడు..మగబిడ్డను జన్మనిచ్చిన అమృత 

                                              

Updated: Jan 30, 2019, 07:00 PM IST
ప్రణయ్ మళ్లీ పుట్టాడు..మగబిడ్డను జన్మనిచ్చిన అమృత 

కులగోడలు బద్దలు కొట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి హత్యకు గురైనా ప్రయణ్.. ఇంట్లో సంతోషకరమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రయణ్ కు ప్రతిరూపంగా అమృత  మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో  సాయంత్రం 4 గంటల సమయంలో అమృత  డెలివరి అయింది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆనందోత్సవాల్లో మునిగితేలుతున్నారు.  తమ కుమారుడు మళ్లీ జన్మించాడని ప్రణయ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

సరిగ్గా పెళ్లే రోజే బుల్లి ప్రణయ్ జననం
ప్రణయ్, అమృత ల పెళ్లిరోజే బిడ్డ పుట్టడం గమనార్హం.. సరిగ్గా ఇదే రోజు కులగోడలు బద్దలు కొట్టి అమృత ,ప్రణయ్ లు ఆర్య సమాజంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.  తోడు నీడగా కలకాలం బతకాలని కలగన్నారు. అయితే అమృత  తండ్రి చేతిలో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన భర్తకు హత్యకు కారణమైన తండ్రిని శిక్షించాలని అమృత పోరాటం చేసింది. చివరికి తండ్రిని  కటకటాలపాలు చేసింది. అప్పటి నుంచి అమృత ..అత్తింట్లోనే ఉంటోంది. అత్తమామలనే తల్లిదండ్రులగా భావిస్తు జీవితాన్ని గడుపుతుంది.