Nara Lokesh: వారిద్దరు నా భార్యను లోబర్చుకొని.. భూములు కొల్లగొట్టారు: నారా లోకేష్‌కు శాంతి భర్త ఫిర్యాదు

Shanti Husband Madan Mohan: మంత్రి నారా లోకేష్‌ను సస్పెన్షన్‌కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ కలిశారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 17, 2024, 11:09 AM IST
Nara Lokesh: వారిద్దరు నా భార్యను లోబర్చుకొని.. భూములు కొల్లగొట్టారు: నారా లోకేష్‌కు శాంతి భర్త ఫిర్యాదు

Shanti Husband Madan Mohan: ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని సస్పెన్షన్‌కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించారు. ఎంపీ అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు బదిలీ చేయించారని అన్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజాదర్బార్‌కు విచ్చేసిన మదన్ మోహన్.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. తాను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపీ)లో అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నానని.. ఎంపీ విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో  ఆర్కే బీచ్ నుంచి భీమిలివరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారు ఫిర్యాదు చేశారు. 

Also Read: Nara Lokesh: వారిద్దరు నా భార్యను లోబర్చుకొని.. భూములు కొల్లగొట్టారు: నారా లోకేష్‌కు శాంతి భర్త ఫిర్యాదు

2022-23 మధ్య తనను ఏమార్చి అమెరికా పంపిన ఎంపీ విజయసాయి రెడ్డి.. తన భార్య శాంతితో రహాస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారని మదన్ తెలిపారు. తాను స్థానికంగా లేని సమయంలో బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని చెప్పారు. తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి డీజీపీలను కలిసి విన్నవించానని అన్నారు. ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని వాపోయారు. 

విజయసాయిరెడ్డికి డీఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో రూ.20 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించిందని చెప్పారు. కుంచనపల్లిలో రూ.4 కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో రూ.3 కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్‌లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయన్నారు. విశాఖలో విజయసాయి, సుభాష్, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ.1500 కోట్ల భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయసాయి కుట్రతో కోల్‌కతాకు బదిలీ అయిన తనను తిరిగి హైదరాబాద్‌కు ట్రాన్స్ ఫర్ చేయించాలని మదన్ మోహన్ విన్నవించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Also Read: Rupee: రూపాయి గింగిరాలు..ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి దేశీయ కరెన్సీ..మరో 11 పైసలు పతనం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News