విశాఖ గాజువాక థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం

Last Updated : Sep 17, 2018, 08:36 AM IST
విశాఖ గాజువాక థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖపట్నం గాజువాకలో శ్రీ కన్య సినిమా హాల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. థియేటర్‌‌పై భాగంలో ఉన్న సెల్‌ టవర్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్నారు. ఐదు ఫైరింజన్లు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాదంలో థియేటర్‌లోని  రెండు స్క్రీన్లు కాలి బూడిదయ్యాయని సమాచారం. థియేటర్ వద్ద దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురైతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఎవరికీ గాయాలు కాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Trending News