AP Cabinet Meeting: కొత్త యేడాదిలో ఏపీ సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,లోకేష్ సహా అందరు క్యాబినేట్ మంత్రులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
ఈ తరుణంలో కొత్త సంవత్సరంలో ప్రారంభించాల్సిన పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు పై జిందాల్ ప్రతినిధులతో భేటీ కానున్నారని సమాచారం.
అంతేకాదు ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఉచిత ఇసుకతో పాటు పోలవరం ప్రాజెక్టులతో పాటు ఉద్యోగుల వేతన బకాయిలతో పాటు అమరావతిలో చేపట్టాల్సిన నిర్మాణాలు అభివృద్ది కార్యక్రమాలకు ఈ క్యాబినేట్ లో ఓకే చెప్పనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు, పీఆర్సీ,ఐఆర్ పై చర్చించే అవకాశాలున్నాయి. సంక్రాంతికి పెండింగ్ డీఏలు ప్రకటించే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.