పార్శిళ్లలో పందెం కోళ్లు... సోషల్ మీడియా ద్వారా అమ్మకాలు... ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Cockfight roosters for sale on online: వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా పందెం కోళ్లను అమ్మకానికి పెడుతున్నారు. పందెం కోడి పేరు, వయసు, ఇప్పటివరకూ అది గెలిచిన పందాలు... ఇలా పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 12:37 PM IST
  • సోషల్ మీడియాలో పందెం కోళ్ల విక్రయాలు
  • పార్శిళ్లలో పందెం కోళ్లు సప్లై
  • ఒక్కో పందెం కోడి ధర రూ.లక్షల్లో
పార్శిళ్లలో పందెం కోళ్లు... సోషల్ మీడియా ద్వారా అమ్మకాలు... ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Cockfight roosters for sale on online: ఏపీలో సంక్రాంతి అనగానే మొదట గుర్తొచ్చేది కోడి పందాలు. పండగ వేళ కోడి పందాలను మించిన ఎంటర్టైన్‌మెంట్ ఉండదని చాలామంది భావిస్తారు. కోడి పందాల నిర్వాహకులైతే పండగకు కొద్ది నెలల ముందు నుంచే రెడీ అయిపోతారు. కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి పందాలకు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో ఏపీలో పందెం రాయుళ్లు కోళ్ల పందాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ పందెం కోళ్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.

వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా పందెం కోళ్లను అమ్మకానికి పెడుతున్నారు. పందెం కోడి పేరు, వయసు, ఇప్పటివరకూ అది గెలిచిన పందాలు... ఇలా పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొంతమంది పందెం కోళ్ల వీడియోలు సైతం పోస్ట్ చేస్తున్నారు. పండగ నేపథ్యంలో ప్రస్తుతం పందెం కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో పుంజుకు రూ.లక్షల్లో ధరల పలుకుతున్నట్లు చెబుతున్నారు.

గిరాకీ కుదిరితే.. పందెం కోళ్లను రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా పార్శిళ్లలో చేరవేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన అట్టపెట్టెలను తయారుచేయిస్తున్నారు. వీటిల్లో కోళ్లకు గాలికి తగిలేందుకు చుట్టూ చిన్న చిన్న కన్నాలు ఉంటాయి. పెట్టెలో కోళ్లు తినేందుకు అవసరమైన దానా లేదా టమోటాలు లాంటివి పెడుతున్నారు. పందెం కోళ్ల కొనుగోళ్ల చెల్లింపులన్నీ పేమెంట్ యాప్స్ ద్వారా జరిగిపోతున్నాయి. ఒకవేళ కోడి నచ్చకపోతే వాపస్ తీసుకునేందుకు కూడా కొంతమంది విక్రయదారులు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ పందెం కోడి ధర రూ.3.60 లక్షలు :

తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట మండలం వికె రాయపురంలో దగ్గుమిల్లి మధు అనే వ్యక్తి పందెం కోళ్లను పెంచుతున్నాడు. అతని వద్ద ఉన్న కోళ్లలో రసంగి పందెం కోడి ధర రూ.3.60 లక్షలు ఉన్నట్లు చెబుతున్నాడు. పచ్చకాకి పందెం కోడి ధర రూ.2.60 లక్షలు ఉన్నట్లు తెలిపాడు. మిగతా పందెం కోళ్ల కంటే ఈ కోళ్లు బరిలో బాగా తలపడుతాయని చెబుతున్నాడు.

కాగా, ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రభుత్వం కోడి పందాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు పండగ వేళ కోడి పందాలకు (Cockfight in AP) శాశ్వత అనుమతినివ్వాలంటూ లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు కోడి పందాల నిర్వాహకులు పందాలకు సిద్ధమైపోతున్నారు. దీంతో ఈసారి కూడా పోలీసుల దాడులు, అరెస్టులు తప్పేలా లేవు.

Also Read: Sun transit in capricorn : మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ 4 రాశుల వారు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News