కేంద్రం ఏపీకి మరో షాక్ ఇచ్చిందా ?

ఏపీకి కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చిందా ?

Last Updated : Aug 14, 2018, 10:09 PM IST
కేంద్రం ఏపీకి మరో షాక్ ఇచ్చిందా ?

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, అంచనాల ఆమోదంలో ముందడుగు పడకపోగా తాజాగా ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు డిజైన్లను సైతం కేంద్రం ఆమోదించలేదని తెలుస్తోంది. రాష్ట్ర జలవనరుల శాఖ పంపించిన డిజైన్లను ఆమోదించని సీడబ్ల్యూసీ విభాగం అధికారులు తామే క్షేత్రస్థాయిలో పర్యటించి డిజైన్లను పరిశీలిస్తాం అని ఏపీ ప్రభుత్వానికి తెలియజేసినట్టు సమాచారం. 

ప్రాజెక్ట్ అంచనాల ఆమోదంలో జాప్యం జరిగినట్టయితే, ఆ వెంటనే రూ. 10వేల కోట్లు మంజూరు చేయాలని, కాపర్ డ్యామ్, స్పిల్ చానల్ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన డిజైన్లను ఆమోదించాల్సిందిగా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన అభ్యర్థనకు స్పందనగా కేంద్రం నుంచి ఈ సమాచారం అందినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి సీడబ్ల్యూసీ ఆమోదిస్తే కానీ నిధులు విడుదల కావు. నిధులు విడుదల కానిదే ప్రాజెక్టు పనులు ముందుకు సాగవు. ఫలితంగా ప్రాజెక్టు పనులను పూర్తిచేయడంలో మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని తాము ఎప్పటికప్పుడు కేంద్రానికి విన్నవిస్తూ వస్తున్నామని ఏపీ సర్కార్ ఆవేదన వ్యక్తంచేస్తోంది. 

Trending News