Ys jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది. రోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న హోంమంత్రి అమిత్ షాను కలిసి వైఎస్ జగన్ ఇవాళ ప్రధాని మోదీని కలవనున్నారు.
కేంద్రం గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే పలు డిమాండ్ల సాధనకై కేంద్రానికి ఇచ్చిన వినతులు ఎంతవరకు ఫలిస్తాయో కాసేపట్లో తేలిపోనుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. దాదాపు ఏడాది తరువాత మోదీ, చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు.
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం 318.22 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సర్కారు పెట్టిన ఖర్చులో భాగంగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పీఎంకేఎస్‌వై కింద పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ నిధులు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నిధులు కూడా దాని ద్వారానే అందుతాయి.
పోలవరంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులను పరిశీలించారు. పనుల తీరు గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కాఫర్ డ్యామ్ నిర్మిస్తే.. వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. ప్రతిపక్షం అపోహలు సృష్టించి పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తోందని .. ఇలాంటి అపోహలు నమ్మవద్దన్నారు. ఒక వేళ పోలవరం ఆగిపోయే పరిస్థితులు వస్తే ఎంతవరకైనా వెళ్తానని చంద్రబాబు పేర్కొన్నారు.
పోలవరం విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీపై ఎదురు దాడికి బీజేపీ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై నమ్మకంతో ప్రాజెక్టు అప్పగిస్తే ఇంత పని చేస్తారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించాల్సింది పోయి.. కేంద్రంపై విమర్శలు చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కేంద్రం వద్ద టీడీపీ అసలు విషయాలను దాచి పెట్టి.. కేవలం సాంకేతికపరమైన అంశాలతో లేఖను రాయడం తగదని అన్నారు.
పోలవరం టెండర్లపై కేంద్రం రాసిన లేఖ గందరగోళానికి గురిచేసింది. కేంద్ర జలవనరులశాఖ రాసిన ఈ లేఖపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే పోలవరం పనుల కోసం పిలిచిన టెండర్లను నిలుపుదల చేయాలంటూ కేంద్ర జలవనరులశాఖ ఏపీ సర్కార్‌కు లేఖ రాసింది. దీనిపై చంద్రబాబు అసెంబ్లీలో స్పందిస్తూ.. పోలవరంపై కేంద్ర జలవనరులశాఖ రాసిన లేఖ వల్ల ప్రాజెక్టు పనులు ముందుకెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిందన్నారు.
టెండర్లు ఆపమంటే కుదరదు..
పోలవరం విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాఫర్ డ్యాంను నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే. ఆయితే ఈ డ్యాంకు సంబంధించిన పనులను తక్షణం నిలుపుదల చేయాలంటూ ఏపీ సర్కార్ కేంద్ర జలవనరుల శాఖ లేఖ రాసింది. అసలు ఆ డ్యాం అవసరం ఉందో లేదో తేల్చాలని..ఇందుకు నిపుణులతో కూడిన కమిటీ వేయబోతున్నామని పేర్కొంది. ఈ కమిటీ పోలవరం సందర్శించి అధ్యయనం చేసి నివేదిక అందించిన తర్వాతే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ..అప్పటి వరకు డ్యాం విషయంలో ముందుకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.