Heat Waves: ఈ ఏడాది వేసవి తీవ్రంగా భయపెడుతోంది. మే నెల రాకుండానే ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రానున్న 3-4 రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందని ఐఎండీ సూచించింది.
ఏపీలో వాతావరణం భయపెడుతోంది. ఉపరితల ఆవర్తనం లేకపోవడం, సముద్రం నుంచి వేడి గాలులు వీస్తుండటంతో రాష్ట్రమంతా ఎండలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకూ రికార్డ్ అవుతున్నాయి. అదే సమయంలో ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గాలిలో తేమశాతం పూర్తిగా పడిపోయిందని తెలుస్తోంది. ఫలితంగా ఉక్కపోత పెరిగిపోయి జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు మూడ్రోజులు రాయలసీమ, కోస్తాంధ్రలో వేడిగాలులు వీయనున్నాయని వాతావరణ శాథ వెల్లడించింది. ముఖ్యంగా నంద్యాల, కడప, ఏజెన్సీలోని 37 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీయనున్నాయి.
ఇక వచ్చేవారం కూడా వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చేవారం మొదటి రెండ్రోజులు 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగానే నమోదు కావచ్చు. అటు పగటి ఉష్ణోగ్రతలు ఇటు వడగాల్పుల కారణంగా ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీలు పగటి పూట బయటకు రావద్దంటున్నారు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు నీరు లేదా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మజ్జిగ, బార్లీ నీళ్లు, నిమ్మరసం, ఓఆర్ఎస్ ఎక్కువగా తీసుకోవాలంటున్నారు.
Also read: Watermelon: మధుమేహం రోగులు పుచ్చకాయ తినవచ్చా లేదా, పుచ్చకాయ తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook