Andhra pradesh Wife Pours Hot Water On Her Husband In Palnadu: పెళ్లయిన తర్వాత భార్యభర్తలన్నాక గొడవలు కామన్. ఇద్దరు పెరిగిన కుటుంబ నేపథ్యం, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కొందరు భార్యభర్తల మధ్య గొడవల జరిగితే పెద్దలు సర్దిచెప్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు ఇద్దరికి కూర్చుండబెట్టి మంచి మాటలు చెబుతారు. అసలైతే మరికొందరు భార్యభర్తలు నాలుగు గోడల మధ్యన గొడవలు పడుతుంటారు. మరల కలిసిపోతుంటారు. తమ బెడ్ రూమ్ లో జరిగిన విషయాన్ని బైటకు రానియ్యరు. కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. ఏది జరిగిన అందరి ముందు పంచాయతీలు పెట్టుకుంటారు. తమ పరువుతో పాటు, కుటుంబపు పరువునుకూడా బజారులో పడేస్తుంటారు.
పెళ్లాయ్యాక ఎఫైర్ లు పెట్టుకుని తమ కాపురంను బజారును పడేసుకునే వారు కొందరైతే.., భార్యను ప్రతిదానికి లేనిపోనీ మాటలతో వేధించేవారు కొందరున్నారు. ఇక భార్యలు కూడా తమ భర్తలను, ఇబ్బందులు పెడుతుంటారు. గొడవలు పడి డైవర్సీలకు వరకు వెళ్తుంటారు. కొద్దిపాటి ఆవేశంలో.. తమ లైఫ్ పార్టనర్ ను హత్యలు చేయడం లేదా చేయించడానికి కూడా కొందరు వెనుకాడటం లేదు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. వినుకొండ పట్టణం హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న భార్యాభర్తలు నాయిని ప్రభుదాసు, అనూషా మధ్య కొంతకాలంగా గొడవలు జరిగాయి. దీంతో పెద్దలు పలుమార్లు ఇద్దరికి కూర్చుని పంచాయతీచేశారు. పెద్దలు ఒప్పించి ఇద్దరిని మరల కాపురానికి ఒప్పించారు. కొంత కాలం కాపురం సజావుగానే సాగింది. కానీ ఏమైందో ఏమో కానీ.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తన భర్త మర్మాంగంపై సల సల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నం చేసింది.
Read More: Mamata Banerjee: బీజేపీకి 400 కాదు కదా.. ఆ సీట్లు కూడా రావంటూ ఘాటువ్యాఖ్యలు చేసిన మమతా..
దీంతో నిద్రలో ప్రభుదాస్ ఒక్కసారి భయంతో లేచి, ఇంటినుంచి బైటకు అరుస్తు పరుగులు పెట్టాడు.వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతని మర్మాంగం, పొట్టభాగం పూర్తిగా కాలిపోయాయి. కాలిపోయి తీవ్ర గాయాలతో నాయిని ప్రభుదాసు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన అత్తామామల చెప్పడం వల్లనే తన భార్య హత్య చేయడానికి ప్రయత్నించిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook