కృష్ణానదిపై మరో అతిపెద్ద బ్యారేజీకి శ్రీకారం; వైకుఠపురం వద్ద శంకుస్థాపన

                                                                                    

Last Updated : Feb 13, 2019, 08:01 PM IST
కృష్ణానదిపై మరో అతిపెద్ద బ్యారేజీకి శ్రీకారం; వైకుఠపురం వద్ద శంకుస్థాపన

ఏపీ నూతన రాజధానికి అమరావతికి సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి మూడు రెట్లు పొడువైన మరో బ్యారేజీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఈ రోజు వైకుఠపురం దగ్గర సరికొత్త బ్యారేజీకి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీకి 23 కిలో మీటర్ల ఎగువన రూ. 2,169 కోట్ల ఖర్చుతో ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్నారు. 

ప్రకాశం బ్యారేజీ కంటే మూడు రెట్లు పొడవు

వైకుఠపురం దగ్గర నిర్మించతలపెట్టిన ఈ బ్యారేజీ పొడవు మొత్తం 3 కిమీ ఉండనుంది. అంటే ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీకి మూడు రెట్లు ఎక్కువ పొడవు ఉండనుందన్నమాట. కాగా పులిచింతల బ్యారేజీ రిజయర్ కు 63 కిమీ దిగువన వైకుంఠపురం బ్యారేజీ ఉంటుంది. అలాగే ప్రకాశం బ్యారేజీకి 12 కి మీ దిగువన చోడవరం దగ్గర కూడా మరో బ్యారేజీ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

అతిపొడవైన రివర్ ఫ్రంట్ మన సొంతం
చంద్రబాబు నిర్మించతలపెట్టిన కష్ణానదిపై ఈ రెండు బ్యారేజీల నిర్మాణం పూర్తయితే కృష్ణానదిలోని మొత్తం 93 కి.మీ మేర నీటిని నిల్వచేసుకునే గొప్ప అవకాశం మనకు దక్కుతుంది. ఇదే జరిగితే ప్రపంచంలోని ఏ రాజధాని నగరానికి లేనటువంటి రివర్ ఫ్రంట్ మనుకు ఉంటుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఈ బ్యారేజీల నిర్మాణం పూర్తయితే మూడు బ్యారేజీల్లో నీరు నిరంతరం ప్రవహిస్తుందని..ఈ జాలశయానికి ఎన్టీఆర్ జాలశయంగా నామకరణం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.

Trending News