AP Budget session: గడ్డాలు పెంచితే రౌడీలా ? మంత్రి అనిల్ కుమార్ ఘాటు కౌంటర్

AP Budget session 2020 | అమరావతి: ఏపీ బడ్జెట్ సెషన్స్‌లో భాగంగా రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు మరోసారి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుపై ( TDP protest over Atchannaidu arrest) తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో అధికార పక్షమైన వైఎస్సార్సీపీకి, ప్రతిపక్షమైన టీడీపీకి ( YSRCP vs TDP) మధ్య మాటల యుద్ధమే నడించింది.

Last Updated : Jun 17, 2020, 01:31 PM IST
AP Budget session: గడ్డాలు పెంచితే రౌడీలా ? మంత్రి అనిల్ కుమార్ ఘాటు కౌంటర్

AP Budget session 2020 | అమరావతి: ఏపీ బడ్జెట్ సెషన్స్‌లో భాగంగా రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు మరోసారి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుపై ( TDP protest over Atchannaidu arrest) తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో అధికార పక్షమైన వైఎస్సార్సీపీకి, ప్రతిపక్షమైన టీడీపీకి ( YSRCP vs TDP) మధ్య మాటల యుద్ధమే నడించింది. శాసన సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎంఎంఎల్సీ జగదీశ్వర్ మాట్లాడుతూ.. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. 300 మంది పోలీసుల సహాయంతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడమే కాకుండా ఆయనకు ఆపరేషన్ అయిందనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా సుదీర్ఘ ప్రయాణం చేయించి వేదించారని జగదీశ్వర్ చైర్మన్ షరీఫ్‌కి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ )

టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ ఆరోపణలపై పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు దొంగతనం చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని అన్నారు. ఇదే విషయమై మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ.. ముద్రగడ ఉద్యమం సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆయనను 3 వేల మంది పోలీసులతో అరెస్ట్ చేయించిందని గుర్తుచేశారు.  Tehsildar Sujatha: షేక్‌పేట తహసిల్దార్ సుజాత భర్త అజయ్ ఆత్మహత్య )

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. గడ్డం పెంచిన రౌడీలు సభకు వస్తున్నారని సోషల్ మీడియాలో మంత్రుల గురించి పోస్టులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మంత్రి అనిల్ కుమార్ కాస్త ఘాటుగానే బదులిచ్చారు. గడ్డం పెంచుకున్నవారందరూ రౌడీలు అవుతారా అని ప్రశ్నించిన ఆయన.. మీకు గడ్డం ఉందంటే మిమ్మల్ని కూడా రౌడీ అనే అనుకోవాలా అని చైర్మన్ షరీఫ్‌ను అడిగారు. చంద్రబాబుకి కూడా గడ్డం ఉందని... మరి ఆయనను కూడా రౌడీ అనే అనుకోవాలా అని మంత్రి అనిల్ కుమార్ టీడీపీ సభ్యులను నిలదీశారు. దీంతో ఇరు పక్షాల సభ్యుల వాగ్వివాదం కారణంగా సభను కాసేపు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News